Sai Pallavi Remuneration For Ramayana: ప్రేమమ్ సినిమాతో సినిమాల్లోకి వచ్చింది మలయాళ బ్యూటీ సాయి పల్లవి. అతి తక్కువ కాలంలోనే మంచి హీరోయిన్‌గా పేరు పొందింది. ఫిదా సినిమాతో (Fidaa Movie) సాయి పల్లవి తెలుగు తెరకు పరిచయమై ఇక్కడ కూడా పాపులర్ హీరోయిన్ అయిపోయింది. అయితే సాయి పల్లవి అందరి హీరోయిన్లలా స్కిన్ షో చేయదు. దాంతో పాటూ తాను చేసే సినిమాలు కూడా చాలా సెలక్టివ్‌గా ఉంటాయి. హోమ్లీ క్యారెక్టర్స్‌కు పెట్టింది పేరైన ఈ నేచురల్ బ్యూటీ కొంత కాలం సినిమాలకు బ్రేక్ తీసుకుంది. దాని తరువాత ఇప్పుడు మళ్ళీ చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్న సాయిబుల్లవి, బాలీవుడ్లో హీరో రామాయణ తోపాటు మరో సినిమాకు సైన్ చేసింది.
భారీ పారితోషకం..
బాలీవుడ్‌లో రణబీర్ (Ranbir Kapoor) రాముని పాత్రలో తీయబోతున్న రామాయణంలో సాయి పల్లవి సీతగా చేస్తోంది. ఈ ప్రాజెక్టు సంబంధించి అతి త్వరలో అధికారికంగా ప్రకటన రాబోతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని సెట్స్ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు తాజాగా సాయి పల్లవి రెమ్యునరేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మామూలుగా ఒక్కో సినిమాకు 2 కోట్ల వరకు తీసుకునే సాయి పల్లవి రామాయణానికి మాత్రం 10 నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటోందని ఇండస్ట్రీ టాక్. ఇక బాలీవుడ్ రామాయణాన్ని మూడు పార్ట్‌లుగా తీస్తారని కూడా చెబుతున్నారు.
Also Read: Bourn Vita: బోర్నవీటాను ఆ లిస్ట్‌లో నుంచి తీసేయండి..కేంద్రం కీలక ఆదేశాలు