‘విభజన రాజకీయాల ప్రత్యక్ష ఫలితమే మణిపూర్ హింస’... !

మణిపూర్ లో జరిగిన హింస తనను ఇంకా కలిచి వేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్ లో హింసను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. విభజన, ద్వేష పూరిత రాజకీయాల ప్రత్యక్ష ఫలితమే ఈ హింస అని మండిపడ్డారు. దేశంలోని ప్రజలు ఒక కుటుంబంలా కలిసి వుండాలని ఆయన పిలుపునిచ్చారు.

author-image
By G Ramu
New Update

కేరళలోని కొడెంచెర్రీలోని జోసఫ్ హైస్కూల్ ఆడిటోరియంలో కమ్యూనిటీ డిసెబిలిటీ మేనేజ్ మెంట్ సెంటర్(సీడీఎంసీ)కి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..... మణిపూర్ లో హింస ఫలితంగా తగిలిన గాయాలు మానడానికి చాలా సంవత్సరాలు పడుతుందన్నారు. ఆ బాధ, కోపం అంత తేలిగ్గా పోవని చెప్పారు.

మణిపూర్ లో జరిగిన హింసను తాను ఒక పాఠంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలో కోపం, ద్వేషంతో కూడిన విభజన రాజకీయాలు పాటిస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని తాను మణిపూర్ ఘటన ద్వారా ప్రపంచానికి తెలిసిందన్నారు. వయనాడ్ లో నిన్న ఆయన మాట్లాడుతూ.... భారత దేశం ఒక కుటుంబం లాంటిదన్నారు. దాన్ని బీజేపీ విడదీయాలని చూస్తోందన్నారు.

మణిపూర్ కూడా ఒక కుటుంబమని, దాన్ని నాశనం చేయాలని బీజేపీ కోరుకుటోందన్నారు. బీజేపీ సిద్దాంతల వల్ల వేలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రజల మధ్య సంబంధాలను బీజేపీ తెంచివేసిందన్నారు. ప్రజలను కలిసి వుండేలా తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. మణిపూర్ బీజేపీ తగుల బెడితే తాము ఐదేండ్లలో దాన్ని పునర్నిర్మిస్తామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు