Sadhguru Jaggi : సద్గురు జగ్గీ వాసుదేవ్ శాంతిపై టాప్ 10 కోట్స్..ఇవే.!

సద్గురు జగ్గీ వాసుదేవ్ తన మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన ఢిల్లీ అపోలో ఆస్పత్రిలోఆపరేషన్ చేయించుకున్నట్లు జర్నలిస్ట్ ఆనంద్ నరసింహన్ సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు. సద్గురు శాంతికోసం చెప్పిన కొటేషన్స్ చూద్దాం.

New Update
Sadhguru Jaggi : సద్గురు జగ్గీ వాసుదేవ్ శాంతిపై టాప్ 10 కోట్స్..ఇవే.!

Sadhguru Quotes : సద్గురు(Sadhguru) చెప్పిన ఈ సూత్రాల ద్వారా మీ ఆధ్యాత్మిక ఉన్నతిని పెంపొందించుకొండి...!!

1. ఆధ్యాత్మిక సాధకునిగా మీరు ఓ నావికుని లాంటి వారు. ఎప్పుడూ మీలోని కొత్త ప్రదేశాలకు వెళ్ళాలనుకునే నావికులు.

2.ఆధ్యాత్మికత(Spirituality) అంటే ఇక ఏ భ్రమలూ లేనట్లే - మీరు ప్రతిదాన్నీఎలా ఉందో అలానే చూస్తారు.

3.మీరు ఎరుకతో ఉంటే అంతా ఆధ్యాత్మికమే. మీరు ఎరుకతో లేకపోతే అంతా ప్రాపంచికమే.

4.సృష్టిలో ఏకత్వం, ప్రతి జీవిలో ప్రత్యేకత ఉన్నాయి. వీటిని గుర్తించి, ఆస్వాదించడమే ఆధ్యాత్మికతలోని సారాంశం.

5.ఆధ్యాత్మిక పథంలో ఉండడం అంటే, మీ బాధకు, మీ శ్రేయస్సుకు మూలం మీలోనే ఉందని అర్ధం చేసుకోవడం.

6.జీవితం(Life) లో అత్యున్నత లక్ష్యం శాంతి కాదు. ఇది అత్యంత ప్రాథమిక అవసరం.

7. ప్రపంచంలోని సంఘర్షణ అనేది మానవ మనస్సు యొక్క బాహ్య అభివ్యక్తి. మానవ మనస్సుకు తేలిక అనుభూతిని కలిగించడంలో శాంతి శక్తిని మనం తెలుసుకుంటాము.

8. వ్యక్తులు శాంతియుతంగా మారితేనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది.

9. మీరు ఆనందంగా(Happy), ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మీ శరీరం, మనస్సు ఉత్తమంగా పనిచేస్తాయి.

10. మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోకపోతే ప్రపంచం ఎలా ప్రశాంతంగా ఉంటుంది? ప్రపంచంలోని సంఘర్షణలు మానవ మనస్సు యొక్క అభివ్యక్తి.

11. మనం వ్యక్తిగత పరివర్తనకోసం క్రుషి చేయకపోతే, ప్రపంచ శాంతి గురించి మాట్లాడటం కేవలం వినోదం మాత్రమే అవుతుంది.

12. బయటి నుంచి శాంతిని అమలు చేయడం సాధ్యం కాదు. మనలో మనం ఎలా ఉన్నామనేదానికి ఇది పరిణామం.

ఇది కూడా చదవండి : ప్రాణపాయ స్థితిలో సద్గురు.. క్లారిటీ ఇచ్చిన ఈషా ఫౌండేషన్ !

Advertisment
తాజా కథనాలు