Crime News: తనకు తానే షూట్ చేసుకున్న సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్‌

మహారాష్ట్రలోని జామ్నర్ టౌన్‌లో దారుణం జరిగింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ సెక్యూరిటీ గార్ట్‌ ప్రకాశ్‌ కప్డే.. తనకు తానే షూట్ చేసుకోని బలవన్మరణానికి పాల్పడ్డారు. సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

New Update
Crime News: తనకు తానే షూట్ చేసుకున్న సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్‌

మహారాష్ట్రలోని జామ్నర్ టౌన్‌లో దారుణం జరిగింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ సెక్యూరిటీ గార్డ్‌.. తనకు తానే షూట్ చేసుకోని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ప్రకాశ్ కడ్పేగా గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్టేట్‌ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ (SRPF) జవాన్‌గా పనిచేస్తున్న ప్రకాశ్.. సచిన్‌కు సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవలే అతను సెలవులు తీసుకొని తన ఇంటికి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటలకు బాధితుడి ఇంట్లో షూట్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే అతడు ఎందుకు తనకు తాను కాల్చుకున్నాడనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ప్రకాశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read: చండీగఢ్ అభ్యర్థి మనీష్ తివారీకి నోటీసులు

మరోవైపు వ్యక్తిగత కారణాల వల్లే ఆయన ఇలా సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ప్రకాశ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రకాశ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర ఉద్యోగులను విచారిస్తు్న్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇంట్లో విషాదం

Advertisment
తాజా కథనాలు