Sachin Tendulkar : దారుణానికి పాల్పడ్డ సచిన్ సెక్యూరిటీగార్డు.. తుపాకీతో కాల్చుకొని..!

మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌ సెక్యూరిటీగార్డు ప్రకాశ్‌ కాప్డే దారుణానికి పాల్పడ్డాడు. సెలవుపై సొంతూరు జామ్నెర్ వెళ్లిన కాప్డే.. అర్ధరాత్రి తన ఇంట్లోనే సర్వీస్ తుపాకీతో మెడపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

New Update
Sachin Tendulkar : దారుణానికి పాల్పడ్డ సచిన్ సెక్యూరిటీగార్డు.. తుపాకీతో కాల్చుకొని..!

Crime : భారత మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌(Sachin Tendulkar) సెక్యూరిటీగార్డు దారుణానికి పాల్పడ్డాడు. సచిన్‌ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వర్తిస్తున్న ఒక సెక్యూరిటీగార్డు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డాడు. స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్(SRPF) జవాన్‌ అయిన ప్రకాశ్‌ కాప్డే (39).. బుధవారం మహారాష్ట్ర(Maharashtra) లోని జామ్నెర్‌ పట్టణంలోని తన సొంత గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అధికారులు వెల్లడించారు.

ఈ మేరకు సెలవుపై వెళ్లిన కాప్డే తన సర్వీస్ తుపాకీతో మెడపై కాల్చుకున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంట్లోనే కాప్డీ ఈ దారుణానికి పాల్పడ్డట్లు జామ్నర్ పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని, విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తాన్నారు పోలీసులు. కాప్డేకుsuicide తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read : టీ20 ప్రపంచకప్‌కు ముందు వివాదంలో దక్షిణాఫ్రికా జట్టు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు