Sachin : సచిన్ డీప్ ఫేక్ ఇష్యూ.. ప్రముఖ వ్యక్తిపై కేసు నమోదు

మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో ఇష్యూపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్ యాక్షన్ మొదలుపెట్టారు. గురువారం ‘స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌’ గేమింగ్ యాప్ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇందుకు పాల్పడిన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.

New Update
Sachin : సచిన్ డీప్ ఫేక్ ఇష్యూ.. ప్రముఖ వ్యక్తిపై కేసు నమోదు

Mumbai : భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కు సంబంధించి చర్చనీయాంశమైన డీప్ ఫేక్(Deep Fake) వీడియో కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఒక గేమింగ్‌ కంపెనీ యజమానిపై ముంబయి(Mumbai) పోలీసులు గురువారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ఆన్ లైన్ గేమింగ్(Online Gaming) లో డబ్బులు సంపాదించుకోవాలంటూ సచిన్ సూచించినట్లు వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా దీనిపై వెంటనే సచిన్ క్లారిటీ ఇస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కంపెనీ యజమానిపై ఎఫ్ఐఆర్‌..
ఈ మేరకు ‘స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌’(Skyward Aviator Quest) అనే గేమింగ్‌ యాప్‌నకు సచిన్‌ ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉంది. అయితే సచిన్ కంప్లైట్ ఇచ్చిన వెంటనే యాక్షన్ మొదలుపెట్టిన ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు.. గురువారం సదరు గేమింగ్‌ కంపెనీ యజమానిపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఈ వీడియోను ఎవరూ పోస్ట్ చేశారు? అపరిచితులు క్రియేట్ చేసి కంపెనీనీ అబాసుపాలు చేయాలనుకున్నారా? లేక డబ్బుల కోసం ‘స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌’ కంపెనీనే ఈ చర్యలకు పాల్పిండిందా? అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : IND VS AFG:డబుల్ సూపర్ ఓవర్…డబుల్ మజా…వాట్ ఏ మ్యాచ్

సచిన్ ఆందోళన..
ఇక దీనిపై స్పందించిన సచిన్.. ఇటీవల కాలంలో టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లు ఎక్కడ ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. నకిలీ సమాచారం, డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా కోరారు. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisment
తాజా కథనాలు