Kishan Reddy: కిషన్ రెడ్డికి రష్యా ప్రభుత్వ ఆహ్వానం! తెలంగాణ బీజేపీ ఛీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రష్యా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. రష్యా రాజధాని మాస్కోలో వచ్చే ఏడాది జూన్‌లో నాలుగవ లెట్స్ ట్రావెల్ రష్యా టూరిజం ఫోరం సదస్సుకు హాజరు కావాలంటూ లేఖ రాసింది. By V.J Reddy 15 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kishan Reddy : రష్యా(Russia) లో వచ్చే ఏడాది జరగనున్న నాలుగవ లెట్స్ ట్రావెల్ రష్యా టూరిజం ఫోరం సదస్సుకు హాజరు కావాలంటూ ఆ దేశ ప్రభుత్వం.. భారత సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం పలికింది. రష్యా రాజధాని మాస్కోలో.. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే ఈ సదస్సుకు రావాలంటూ.. ఆ దేశ ఆర్థిక శాఖ సహాయ మంత్రి దిమిత్రి వఖ్రుకోవ్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. భారత్-రష్యా మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక, పర్యాటక బంధాన్ని వఖ్రుకోవ్ గుర్తుచేస్తూ.. పర్యాటక, వ్యాపార రంగాల్లో భారతదేశం సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఇదొక మంచి వేదిక అని అందుకే ఈ కార్యక్రమంలో వ్యక్తిగతంగా పాల్గొనాలని కిషన్ రెడ్డిని కోరారు. ఈ వేదిక ద్వారా భారతదేశ పర్యాటక, సాంస్కృతిక సామర్థ్యాన్ని, సంప్రదాయాలను. రష్యా పర్యాటకులకు తెలియజేసేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ALSO READ: పెన్షన్ రూ.3,000కు పెంపు…రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం జనసేనతో కటీఫ్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు జనసేనకు కటీఫ్ చెప్పేసింది బీజేపీ. లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) ఇవాళ జరిగిన ముఖ్యనేతల సమావేశంలో కుండ బద్దలు కొట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసింది. ఆ పార్టీకి ఎనిమిది స్థానాలను కేటాయించగా.. ఒక్క సెగ్మెంట్ లో కూడా జనసేన అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు దక్కించుకునే ఓట్లు రాలేదు. దీంతో పొత్తుతో పెద్దగా ప్రయోజనం లేకపోయిందని బీజేపీ డిసైడ్ అయ్యింది. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యం ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడ మే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ ముఖ్యనేతల కు పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో ఒం టరిగానే పోటీ చేస్తామని, సర్వే సంస్థల అంచ నాలకు మించి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నిక లకు సన్నద్ధం చేయడంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెలాఖ రున రాష్ట్రానికి వస్తారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తో సమాంతరంగా బీజేపీ పోటీలో ఉంటుందని చెప్పారు. ALSO READ: BREAKING: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు #bjp #telugu-latest-news #bjp-kishan-reddy #russia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి