Russia - North Korea : ఉత్తర కొరియాకు మేకలిచ్చిన రష్యా... ఎందుకో తెలుసా! రష్యా, ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహం గత కొంతకాలంగా బలపడుతోంది. ఈ క్రమంలోనే రష్యా తన మిత్ర దేశానికి వందలసంఖ్యలో మేకలను బహుమతిగా పంపింది.దీని వల్ల అక్కడ కొంతమేర పాల కొరత తగ్గుతుందని రష్యా చెప్పింది. By Bhavana 14 Aug 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Russia : నియంతృత్వ పాలన సాగిస్తున్న దేశాల్లో ముందు వరుసలో వినిపించే పేర్లు ఏవైనా ఉన్నాయంటే.. అవి కచ్చితంగా రష్యా, ఉత్తర కొరియా (North Korea) మొదటి రెండు స్థానాల్లో నిలుస్తాయి. కొన్ని దశాబ్దాలుగా రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కు ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ (Kim-Jong-Un) కు ఎదురే లేదు. గత కొద్ది రోజులుగా ఈ రెండు దేశాల మధ్య స్నేహ బంధం బలపడింది. ఈ రెండు దేశాలను మిగిలిన దేశాలు ఎంతలా వ్యతిరేకిస్తుంటే... పుతిన్, కిమ్ మధ్య స్నేహం అంత బలంగా మారుతోంది. కాగా వారి స్నేహనికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఉత్తర కొరియాకు 432 మేకలు, 15 మేకపోతులను పంపించింది. గతేడాది పుతిన్-కిమ్ మధ్య శిఖరాగ్ర సమావేశం జరిగిన విషయం తెలిసిందే. పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారం అందించుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించుకున్నారు. ఉత్తర కొరియాలో చిన్నారులకు దీర్ఘకాలంగా పాల ఉత్పత్తుల కొరత ఏర్పడింది. ఇప్పుడు పంపిస్తున్న మేకల ద్వారా ఆ లోటును పూర్తి చేసే అవకాశముంటుందని పేర్కొంది. పశ్చిమ తీర ప్రాంతంలోని రేవు పట్టణం నాంఫో శివార్లలో భారీ మేకల ఫార్మ్ లు నిర్మిస్తున్నారు. రష్యా పంపించిన మేకల ద్వారా ఈ ఫార్మ్ లలో మేకల సంతతిని భారీగా పెంచనున్నారు. దీని వల్ల మేక పాల కొరత తీరుతుందని కిమ్ ప్రభుత్వం భావిస్తోంది. Also Read: మాజీ సర్పంచ్ భర్త దారుణ హత్య! #kim-jong-un #russia #vladimir-putin #north-korea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి