Russia-Ukrain Conflict: ఉక్రెయిన్‌లో విద్యుత్ వ్యవస్థను టార్గెట్‌గా చేసుకుని రష్యా మరోసారి విరుచుకుపడింది. రష్యా సరిహద్దు ప్రాంతం అయిన సుమీ రీజియన్ ీద దాడి చేసింది. దీంతో అక్కడ లక్ష ఇళ్ళల్లో కరెంట్ ఆగిపోయింది. దాంతో పాటూ నీటి సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. ఇక దొనెట్స్క్ రీజియన్ మీద మాస్కో జరిపిన దాడుల్లో 11 మంది ఉక్రెయిన్లు చనిపోయారు. మరో 43మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా 70కిపైగా గ్లైడ్ బాంబులు, ఆరు రాకెట్లను మాస్కో ప్రయోగించిందని, 55 వైమానిక దాడులు జరిపిందని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది.
దొనెట్క్సోలోని పోక్రోవ్క్స్‌లో ఇరు దేశాలకు పెద్ద యుద్ధం జరుగుతోంది. ఇరుదళాలు 45సార్లు ఘర్షణ పడ్డాయి. చాసివ్ యార్‌లో ముగ్గురు మరణించారు. మాస్కో దాడుల్లో ఈ పట్టణం పూర్తిగా ధ్వంసం అయింది. ఇంతకు ముందే కీవ్ బలగాలు ఇక్కడి నుంచి వెళ్ళాయి. సుమీలోని ఓ ఆయుధ కర్మాగారంపైనా పుతిన్ సేనలు దాడి చేశాయి. మరోవైపు రష్యాలోని బెల్గొరోడ్ రీజియన్‌లో ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో ఇద్దరు గాయపడ్డారు. కుర్స్క్, బెల్గొరోడ్‌లలో ఎనిమిది డ్రోన్లను నేలకూల్చినట్లు రష్యా రక్షణశాఖ తెలిపింది.