Lok Sabha Elections: వరంగల్ ఎంపీ స్థానం వారిదే.. RTV సంచలన రిపోర్ట్

నెలరోజుల క్రితం తెలంగాణ పార్లమెంటు ఎన్నికలపై RTV ఇచ్చిన స్టడీ రిపోర్ట్ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి..? దీనివల్ల ఫలితాల్లో ఏం మార్పు ఉండబోతుందో లైవ్‌లో చూడండి.

Lok Sabha Elections: వరంగల్ ఎంపీ స్థానం వారిదే.. RTV సంచలన రిపోర్ట్
New Update

నెలరోజుల క్రితం తెలంగాణ పార్లమెంటు ఎన్నికలపై RTV ఇచ్చిన స్టడీ రిపోర్ట్ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి..? దీనివల్ల ఫలితాల్లో ఏం మార్పు ఉండబోతుందో చూద్దాం. వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య గెలిచే అవకాశం ఉందని పోలింగ్‌కు ముందు చేసిన RTV స్టడీలో చెప్పాం. కానీ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితి మారుతూ వచ్చింది. బీజేపీ అభ్యర్ధి ఆరూరి రమేష్‌ ఆర్ధికంగా బలంగా ఉండటంతోపాటు భారీగా అనుచరగణం ఉంది. పోలింగ్‌కు 3-4 రోజుల ముందు నుంచి సంఘ్ పరివార్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసింది. వరంగల్‌కు స్మార్ట్ సిటీ గుర్తింపు, ఎయిర్ పోర్ట్ హామీ, కాజీపేట్ రైల్వే డివిజన్ లాంటి అంశాల్ని బీజేపీ బలంగా జనంలోకి తీసుకెళ్లింది. మందకృష్ణ మాదిగ ప్రచారం కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అయింది.

కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య, ఆమె తండ్రి కడియం శ్రీహరి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్‌లోకి రావడం ఆ పార్టీలో అంతర్గత సమస్యలకి కారణమైంది. విద్యావంతుల్లో మోదీ మేనియా ఉండటం ఆరూరి రమేష్‌ విజయావకాశాల్ని పెంచేసింది. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్‌ ఎన్నికకు వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఏం మారిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 6 సెగ్మెంట్లలో కాంగ్రెస్, ఒక్కచోట బీఆర్ఎస్ గెలిచాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరడంతో మొత్తం ఏడు సెగ్మెంట్లు కాంగ్రెస్‌ ఖాతాలో చేరిపోయాయి. అయితే పార్లమెంట్‌ ఎన్నిక నాటికి పరిస్థితి అనూహ్యంగా మారిపోయి బీజేపీని గెలుపు దిశగా తీసుకెళ్లాయి.

స్డేషన్‌ ఘన్‌పూర్‌

వరంగల్ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో ముందుగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ అసెంబ్లీ సీటుకి వెళ్దాం. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధిగా తన కుమార్తె కడియం కావ్యకి టికెట్ తెచ్చుకున్నారు. బీఆర్ఎస్‌కు పట్టున్న ఈ సెగ్మెంట్‌లో కడియంకి తాటికొండ రాజయ్యకు మధ్య ఉన్న గొడవ కాంగ్రెస్‌ను దెబ్బతీసింది. కడియంకు వ్యతిరేకంగా గట్టిగా ప్రచారం చేసి బీఆర్ఎస్‌కి ఓట్లు పడేలా రాజయ్య కష్టపడ్డారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరను ఓడించారు కడియం. దీంతో ఆయన్ను దెబ్బతీయాలన్న పట్టుదలతో ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నేతలు పని చేయడం కావ్యకి మైనస్ అయింది. ఓవరాల్‌గా ఈ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్‌కు ఎక్కువ ఓట్లు పడటం బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. publive-image

పాలకుర్తి

ఇక పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలిచింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ హవా కనిపించింది. ఈ సెగ్మెంట్‌లో తాజాగా అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఓడిపోయిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్‌కు ఓట్లు పడకుండా కృషి చేశారు. ఇది బీజేపీకి కలిసొచ్చినట్లు స్పష్టమవుతోంది.

పరకాల

ఇప్పుడు పరకాల చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ గెలిచింది. అయితే ఇప్పుడు పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారింది. సంఘ్‌ పరివార్‌ ఈ సెగ్మెంట్‌లో బలంగా ఉంది. బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడ ఉన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు కాబట్టి మోదీ మేనియా కూడా ఇక్కడ పని చేసిందనే చెప్పాలి.

వరంగల్ ఈస్ట్, వెస్ట్

publive-image

వరంగల్‌ ఈస్ట్‌, వెస్ట్‌ నియోజకవర్గాల్లో ఈసారి అతి తక్కువ పోలింగ్‌ నమోదైంది. విద్యావంతులు ఎక్కువగా ఉండటంతో పడిన ఓట్లలో బీజేపీకే ఎడ్జ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్‌ ఈస్ట్‌లో బీజేపీకే అనుకూల పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ అర్బన్‌ ఏరియాలో బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంక్‌ కూడా ఈసారి బీజేపీ వైపు పడినట్లు పోల్‌ పండితులు చెబుతున్నారు. వరంగల్‌ వెస్ట్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉన్నా ఈసారి ప్రభావం తక్కువేనని తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకత కనిపిస్తోంది. అది బీజేపీకి ప్లస్‌ అయినట్లు తెలుస్తోంది.

వర్ధన్నపేట

వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ నుంచి కే.ఆర్‌.నాగరాజు గెలిచారు. అయితే ఇది బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్‌ సొంత నియోజకవర్గం కావడం ఆయనకు ప్లస్‌ అయింది. బీజేపీ హవా, మోదీ ప్రచారం ఆయనకు కలిసి వచ్చినట్టు పోలింగ్‌ తర్వాత జరిపిన మా అధ్యయనంలో తేలింది.

publive-image

భూపాలపల్లె

భూపాలపల్లె అసెంబ్లీ సీటులో కాంగ్రెస్‌ నుంచి గండ్ర సత్యనారాయణ గెలిచారు. ఈ సెగ్మెంట్‌లోనూ ఇప్పుడు అత్యధికంగా ఓట్లు పడ్డాయి. ఇది కూడా కాంగ్రెస్‌ అనుకూల సీటు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ BJP- RSS శ్రేణులు ప్రతి గడప గడపను టచ్‌ చేశారు. రామాలయ నిర్మాణ అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లారు. దీని ప్రభావం పోలింగ్‌పై కనిపించింది. మొత్తానికి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది.

publive-image

బీజేపీ:

1. అదిలాబాద్ - బీజేపీ

2. నిజామాబాద్- బీజేపీ

3. కరీంనగర్- బీజేపీ

4. మెదక్ - బీజేపీ

5. చేవెళ్ల - బీజేపీ

6. మల్కాజ్ గిరి - బీజేపీ

7. మహబూబ్ నగర్ - బీజేపీ

8. జహిరాబాద్ - బీజేపీ

9. వరంగల్ - బీజేపీ

10. సికింద్రాబాద్ - బీజేపీ

కాంగ్రెస్:

10. పెద్దపెల్లి - కాంగ్రెస్

11. మహబూబాబాద్ - కాంగ్రెస్

12. ఖమ్మం - కాంగ్రెస్

13. నల్గొండ - కాంగ్రెస్

14. భువనగిరి - కాంగ్రెస్

15. నాగర్ కర్నూల్ - కాంగ్రెస్

ఎంఐఎం: 

17. హైదరాబాద్ ఎంఐఎం

#telangana #telugu-news #lok-sabha-elections
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe