Singareni : ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర! సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ఎన్నికల కోసం కార్మిక సంఘాలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3వేలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే, మహిళలకు ఫైస్టార్ విందులు, బ్రాండెడ్ చీరలు ఇచ్చినట్లు తెలుస్తోంది. By V.J Reddy 27 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Singareni Elections : అసెంబ్లీ(Assembly), పార్లమెంట్(Parliament), సర్పంచ్, ఎంపీటీసీ వంటి ఎన్నికల్లో కామన్ గా వినిపించే మాట ఓటుకు ఎంత ఇస్తున్నారని. అయితే, తాజాగా సింగరేణి సంఘాల ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో చుక్కా.. ముక్కా.. మూడువేలు.. అన్నట్లు సాగుతోందట. సింగరేణిలో అధికారం చెలాయించేందుకు అక్కడి కార్మిక సంఘాలు సింగరేణి కార్మికులను మెప్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయట. అసెంబ్లీ ఎన్నికలు పండుగ ముగిసిన తరువాత సింగరేణి కార్మికులకు ఈ ఎన్నికలు మరో పండుగ అనే చెప్పాలి. ALSO READ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పురుషులకు ప్రత్యేక బస్సులు? సింగరేణిలో యథేచ్ఛగా ఓట్ల కొనుగోళ్లు జరుగుతున్నాయి. సింగరేణి(Singareni) లో చివరి రోజు ప్రలోభాల పర్వం కొనసాగింది. గుర్తింపు ఎన్నికల్లో గెలుపు కోసం కార్మికులకు నాలుగు ప్రధాన కార్మిక సంఘాల తాయిళాలు ఇచ్చాయి. కార్మికులకు మూడు వేల రూపాయల నగదు మూడు కోటర్లు విందు ఏర్పాటు చేసిన ఓకార్మిక సంఘం. వెయ్యి రూపాయల నగదుతో సరిపెట్టిన మరో కార్మిక సంఘం. స్టీల్ ప్లేట్లు, వెయ్యి రూపాయలతో కార్మిక ఓటర్లకు ఎరవేసిందట మరో సంఘం. చివరి నిమిషంలో కొన్ని ఏరియాల్లో కాపర్ వాటర్ బాటిళ్లు, కొన్ని చోట్ల ఓటుకు వెయ్యి రూపాయల నగదు పంపిణీ చేసిన ప్రధాన కార్మిక సంఘం. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా నగదు పంపిణీ చేశాయి కార్మిక సంఘాలు. యువ కార్మికులే టార్గెట్ గా మందు, విందు ఏర్పాటు కార్మిక సంఘాలు చేసినట్లు సమాచారం. మహిళా కార్మికులకు ఫైస్టార్ విందులు, బ్రాండెడ్ చీరలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ALSO READ: BREAKING: భారత్ లో భారీ భూకంపం! ఇదిలా ఉండగా.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో 39, 748 కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలు 700 మంది సిబ్బందిని కేటాయించారు. #brs #congress #breaking-news #singareni-elections #singareni-election-updates #election-coverage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి