BSP: బహుజన్ సమాజ్ పార్టీకి (BSP) రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ (RSP) సోమవారం గులాబీ కండువా కప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ (KCR) సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ట్విటర్ (Twitter) వేదికగా వివరించారు. '' తన రాజకీయ భవితవ్యం పై ఆదివారం వందల మంది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపానని'' ... ఆర్‌ఎస్పీ అన్నారు.
ఈ క్రమంలో ఆ సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ తన మీద నమ్మకంతో తాను తీసుకున్న నిర్ణయానికి తన వెంట నడుస్తామని వారు మాట ఇచ్చారు. వారందరికీ కూడా నా హృదయ పూర్వక ధన్యవాదాలంటూ ఆర్ఎస్పీ పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రజలకు అందాల్సిన విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని , దేశంలోని లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను సోమవారం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.
తాను ఎక్కడున్నప్పటికీ కూడా బహుజన మహనీయుల ఆశయాలను, సిద్దాంతాలను గుండెలో పదిలంగా ఉంచుకుంటానని వారి కలలను నిజం చేసే దిశగా పయనిస్తానని పేర్కొన్నారు. అందరూ కూడా నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరుతూ.. జై భీం.. జై తెలంగాణ, జై భారత్ అంటూ ఆర్‌ఎస్పీ ట్వీటర్ వేదికగా కోరారు.
Also read: గుండెజబ్బులు, కొలెస్ట్రాల్ నుంచి కాపాడుకోవడానికి ఈ 3 రకాల నూనెలు ఉత్తమమైనవి!