TS Elections: నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా ఆర్‌ఎస్ ప్రవీణ్ పోటీ

పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఎస్పీ నుంచి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఆర్‌ఎస్ ప్రవీణ్ పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

R.S. Praveen Kumar : భూమి లేదు కానీ క్రిమినల్ కేసులున్నాయి-ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
New Update

RS Praveen Kumar Contesting from Nagarkurnool: రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ - బీఎస్పీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పొత్తులో భాగంగా ఇరుపార్టీలు జరిపిన చర్చల అనంతరం.. రెండు సీట్లను బీఎస్పీకి కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

ALSO READ: వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఆర్‌ఎస్ ప్రవీణ్ కి లైన్ క్లియర్..

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కు లోక్ సభ ఎన్నికల్లో పోటీకి లైన్ క్లియర్ అయింది. పొత్తులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఎస్పీ కి నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలు కేటాయించడంతో నాగర్ కర్నూల్ నుంచి మొ అభ్యర్థిగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. అయితే.. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఎస్పీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత కొన్ని ఏళ్లుగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎంఐఎం పార్టీకి కంచుకోటగా ఉంది. మారి ఆ స్థానంలో బీఎస్పీ ఎవరిని నిలబెడుతుందో వేచి చూడాలి.

ఎమ్మెల్యే పోయి.. ఎంపీ వచ్చే..

ఇటీవల జరిగిన తేలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండి ఆర్‌ఎస్ ప్రవీణ్ ఓడిపోవడం బీఎస్పీ హావా తెలంగాణలో లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా మిగిలిపోయింది. అయితే.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే తమకు డిపాజిట్ కూడా రాదని భావించిన ఆర్‌ఎస్ ప్రవీణ్.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే కనీసం బీఎస్పీ నుంచి ఒకరినైనా పార్లమెంట్ కు పంపించవచ్చు అని భావించారు. మరోవైపు కేసీఆర్ కూడా ఎంపీ అభ్యర్థుల లోటు ఉండడంతో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకొని లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. పొత్తు ఆర్‌ఎస్ ప్రవీణ్ పార్లమెంట్ కు పంపుతుందో లేదో వేచి చూడాలి.

#brs #kcr #lok-sabha-elections-2024 #rs-praveen-kumar #brs-bsp-alliance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe