Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు కోర్టు షాక్! ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూస్ అవెన్యూ కోర్టు సమన్లు పంపింది. మార్చి 16 లోగా ఈడీ ముందు హాజరు కావాలని కేజ్రీవాల్ ను కోర్టు ఆదేశించింది. By Bhavana 07 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Delhi Court Summons Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో(Delhi Liquor Scam) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) కు రూస్ అవెన్యూ కోర్టు సమన్లు పంపింది. మార్చి 16 లోగా ఈడీ ముందు హాజరు కావాలని కేజ్రీవాల్ ను కోర్టు ఆదేశించింది. ఇంతకు ముందు కేజ్రీవాల్ కు ఈడీ 8 సార్లు సమన్లు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు ఆయన ఈడీ(ED) ముందు హాజరు కాలేదు. ఈ సమన్లన్నీ కూడా చట్ట విరుద్దంగా ఉన్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈడీ సమన్లు చట్టవిరుద్దమని, కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సమాధానం ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. గురువారం కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకులను ఈడీ ద్వారా వేధిస్తున్నట్లు, బీజేపీ(BJP) లో చేరమని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. Also Read : 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం, హత్య? ..కాళ్లు చేతులు కట్టేసి డ్రైనేజీలో పడేసిన దుర్మార్గులు! ఈ కేసులో ఇప్పటివరకు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి విజయ్ నాయర్‌తో పాటు కొందరు మద్యం వ్యాపారులను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఇంతకు ముందు కూడా ఆప్ కి సుప్రీం కోర్టు(Supreme Court) లో పెద్ద ఎదురు దెబ్బె తగిలింది. పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయమని కోర్టు ఆదేశించింది. ఆప్(AAP) కార్యాలయం రూస్ అవెన్యూ కోర్టు స్థలంలో నిర్మించారని కోర్టు చెప్పింది. కావాలంటే భూమి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దేశంలో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టుకుంది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి కోర్టు అదనపు సమయం ఇచ్చింది. జూన్ 15 లోగా కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. #aravind-kejriwal #ed #delhi-liquor-scam #aap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి