Heavy Rains : భారీ వర్షాలకు కూలిన ఎయిర్‌ పోర్ట్‌ రూఫ్‌.. ఒకరు మృతి

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుడండంతో ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌ లోని టెర్మినల్‌ 1 లో పై కప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడగా..వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వివరించారు.

Heavy Rains : భారీ వర్షాలకు కూలిన ఎయిర్‌ పోర్ట్‌ రూఫ్‌.. ఒకరు మృతి
New Update

Delhi : దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. దీంతో రోడ్లన్ని కూడా జలయమయ్యాయి. ఈ క్రమంలోనే భారీగా వరద నీరు రావడంతో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. చాలా కార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి.

భారీ వర్షాలు కురుస్తుడండంతో ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌ (Indira Gandhi Airport) లోని టెర్మినల్‌ 1 లో పై కప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడగా..వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వివరించారు.ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది (Fire Fighters) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంలో పైకప్పు కింది పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

Also read: ఘోర రోడ్డు ప్రమాదం …రెండు లారీలు ఢీ.. నలుగురు మృతి

#airport #delhi #roof #coolapsed
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe