India vs England 5th Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో భారత ప్లేయర్లు అద్భుతంగా ఆడేస్తున్నారు. ఇప్పటికే సీరీస్ మన వశం అయిపోయింది. అయినా సరే వదిలేదే లేదు అంటున్నారు. నిన్న మొదలైన మ్యాచ్‌లో ఇంగ్లాండ్(England) 218 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్లు ధాటికి తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యారు. తరువాత బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లు కూడా ఇంగ్లాండ్ ప్లేయర్లను చెడుగుడు ఆడుకుంటున్నారు. టీమ్ ఇండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), శుభ్‌మన్‌గిల్(Shubman Gill) ఇద్దరూ పెంచరీలతో చెలరేగిపోయారు. ఈ సీరీస్‌లో వీరిద్దరికీ ఇది రెండవ సెంచరీ. దీంతో ఈరోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 60 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 264 పరుగులుగా ఉంది.
కెప్టెన్ రోహిత్ శర్మ 154 బంతుల్లో 13 ఫోర్లు, ౩ సిక్స్‌లతో సెంచరీ కొట్టాడు. ఇక శుభ్‌మన్ 141 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో శతకం సాధించాడు. ఈ సెంచరీతో రోహిత్ తన కెరీర్‌లో 48 సెంచరీలు చేశాడు. భారత్ తరుఫున ఎక్కువ సెంచరీలు చేసిన వారి లిస్ట్‌లో రాహుల్ ద్రావిడ్‌తో సమానంగా ఉన్నాడు. ఈంతేకాక 2021 నుంచి ఎక్కువ టెస్ట్ శతకాలు సాధించిన భారత క్రికెటర్ కూడా రోహిత్ శర్మే. హిట్ మ్యాన్ మొత్తం 6 సెంచరీలు చేయగా..ఆ తర్వాత స్థానంలో గిల్ 4 సెంచరీలతో ఉన్నాడు.
Also Read : Hyderabad: హైదరాబాద్ వాసులకు అలెర్ట్..రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్