Rohit-Rinku: మునిగిపోయిన పడవను రెండు చేతులతో ఒడ్డుకు చేర్చారు.. ఇద్దరికి ఇద్దరే!

అఫ్ఘాన్‌పై జరిగిన మూడో టీ20లో 5వ వికెట్‌కు 190 పరుగుల పార్టనెర్‌షిప్‌ని క్రియేట్ చేశారు రింకూ-రోహిత్ జోడి. రోహిత్‌ సెంచరీతో చెలరేగగా.. రింకూ అర్థసెంచరీతో సత్తా చాటాడు. ఇది అంతర్జాతీయ టీ20ల్లో ఓవరాల్‌గా 9వ అత్యధిక భాగస్వామ్యం!

New Update
Rohit-Rinku: మునిగిపోయిన పడవను రెండు చేతులతో ఒడ్డుకు చేర్చారు.. ఇద్దరికి ఇద్దరే!

Rohit Sharma 🤝 Rinku Singh: 18/1 , 18/2 , 21/3 , 22/4... పట్టుమని ఐదు ఓవర్లు కూడా ముగియకముందే టీమిండియా నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది. యశస్వీ, కోహ్లీతో పాటు ఫామ్‌లో శివమ్‌ దూబే వికెట్‌ను చేజార్చుకుంది. ఇక ఈ సిరీస్‌లో రాకరాక వచ్చిన ఏకైక ఛాన్స్‌ను సంజూశాంసన్‌ చేజేతులా నాశనం చేసుకున్నాడు. ఆదుకోవాల్సిన టైమ్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో కెప్టెన్ రోహిత్‌ శర్మ(Rohit Sharma) డీలా పడ్డాడు. ఒక ఎండ్‌లో నిలబడి ఉన్న రోహిత్ తన సహచర ప్లేయర్లు వరుస పెట్టి అవుట్ అవుతుంటే తలదించుకోని నేల చూపులు చూశాడు. అప్పుడే గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రింకూ సింగ్‌(Rinku Singh). రింకూ సామర్థ్యం రోహిత్‌కు తెలియనది కాదు.. అయినా అతను కూడా అవుటైతే.. పరిస్థితేంటన్న ఆలోచన. మరోవైపు అఫ్ఘాన్‌ బౌలర్లలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక రోహిత్‌ తన బ్రెయిన్‌కు పదును పెట్టాడు. ముందుగా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. రింకూకు అదే చెప్పాడు. కెప్టెన్‌ చెప్పింది తూచా తప్పకుంగా ఫాలో అయ్యాడు ఈ నయా స్టార్‌ ఫినీషర్‌.


హిట్‌మ్యాన్‌ విశ్వరూపం:
4.3 ఓవర్లలో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాను 20 ఓవర్లలో 212 పరుగులకు తీసుకెళ్లేవరకు రోహిత్‌-రింకూ ఆడిన విధానం అసాధారణం. ఎక్కడా తడపడలేదు.. ఎక్కడా వెన్నుచూపలేదు.. కూల్‌గా, కామ్‌గా, కాంపోజ్డ్‌గా ఈ జోడి స్కోరు బోర్డును నడిపించింది. టైమ్‌ చూసి పరుగులు పెట్టించింది.. చివరిలో ఊచకోతే కోసింది. ఇది కదా పద్ధతంటే.. తనపై ట్రోల్స్‌ చేసిన వారికి రోహిత్‌ మరోసారి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ముందుగా హాఫ్‌ సెంచరీ, తర్వాత సెంచరీ.. చివరిలో దంచికొట్టుడు స్ట్రాటజీతో రోహిత్‌ వారేవ్వా అనిపించాడు. 69 బంతుల్లో 121 రన్స్‌ చేసిన రోహిత్ శర్మ అంతటితో ఆగలేదు.. డబుల్ సూపర్‌ ఓవర్లలోనే అదే దూకుడు..అదే కొట్టుడు.. అసలు అలుపే లేదు.. నిరసమే రాలేదు.. ఒకటే ఎనర్జీతో డబుల్‌ సూపర్‌ ఓవర్స్‌ మ్యాచ్‌లో త్రిపుల్‌ హీరోగా నిలిచిన రోహిత్‌ ఒంటిచేత్తో మ్యాచ్‌ను ఒడిసిపట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మిగిలిన ప్లేయర్లదంతా ఒకటైతే.. రోహిత్‌ ఆట మరొకటి.. అందుకే అతను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా హిట్‌మ్యానే!

ఫ్యూచర్‌ అంతా రింకూదే:
ఇటీవలి కాలంలో క్రికెట్‌ సర్కిల్స్‌లో రింకూ సింగ్‌ గురించి జరుగుతున్న చర్చ మరే ప్లేయర్‌ గురించి జరగలేదని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు. ఆపదలో ఉన్నా.. జట్టుకు భారీ స్కోరు కావాలన్నా.. నిలబడలన్నా..బలంగా తలపడలన్నా రింకూను చూసి తోటి యువ క్రికెటర్లు నేర్చుకోవచ్చు. అసలు అతనికి గివ్‌ అప్‌ ఇవ్వడమే రాదు.. అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లో రోహిత్‌కు పూర్తి అండగా నిలబడి బ్యాటింగ్‌ చేశాడు రింకూ. వీలుచిక్కినప్పుడు బౌండరీలు బాదిన రింకూ చివరి ఓవర్‌లో చివరి మూడు బంతులను సిక్సర్లగా మలిచి తన ఫినీషింగ్‌ స్కిల్స్‌ను మరోసారి ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఇప్పటివరకు అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకున్న రింకూ టీమిండియాకు భవిష్యత్‌లో మరవలేని విజయాలు అందించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ ఇద్దరి ఆట ఫ్యాన్స్‌ను మైమరిపించింది.

Also Read: మహిళలకు ఉచిత ప్రయాణం ఆగిపోనుందా? హైకోర్టులో దాఖలైన పిల్

WATCH:

Advertisment
తాజా కథనాలు