Kapil dev Comments on Rohit Sharma: న్యూజిలాండ్ మాజీ స్టార్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ అయిన తర్వాత బెన్‌స్టోక్స్ సారథ్యంలో బజ్‌బాల్ విధానానికి శ్రీకారం చుట్టాడు. పరిమిత ఓవర్ల మాదిరే టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శించాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌కు గుర్తుండిపోయేలా విజయాలు సాధించిందించిందని తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు.డ్రాగా ముగిసినా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లోనూ దూకుడును కొనసాగించింది. తొలి టెస్టులో అతి విశ్వాసంతో ఓటమి పాలైనా వెనక్కి తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగింది. ఈ క్రమంలో పర్యాటక ఆసీస్‌తో కలిసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-2తో సమానంగా నిలిచి డ్రాతో సరిపెట్టుకుంది.
తాజా ఇంటర్వ్యూలో బజ్‌బాల్ విధానంపై ప్రశంసలు
అయితే, సిరీస్‌లో భాగంగా ముఖ్యంగా ఆఖరి టెస్టు ఆట తీరు సై అంటే సై అన్నట్లుగా సాగడం క్రికెట్ అభిమానులకు మంచి కన్నులపండువగా ఆటను అందించింది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ తాజా ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను వ్యక్తపరుస్తూ బజ్‌బాల్ విధానంపై ప్రశంసలు కురిపించాడు. ‘‘బజ్‌బాల్ అద్భుతం అంటూ కితాబ్ ఇచ్చాడు. రోహిత్ మరింత దూకుడుగా ఉండాలని సలహా ఇచ్చాడు. ఇటీవల నేను చూసిన సిరీస్‌లలో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా సిరీస్ అత్యుత్తమంగా అనిపించింది. నిజానికి క్రికెట్ అంటే అలాగే ఆడాలి మరి. మన కెప్టెన్ రోహిత్ వర్మ మంచి సారథి అనడంలో సందేహం లేదు. అయితే నాయకుడిగా తను కూడా ఇకపై మరింత దూకుడుగా ఉండాలి. ఇంగ్లండ్ ఎలా ఆడుతుందో గమనించాలని కోరారు.
దూకుడుగా ఆడాలని కోరిన కపిల్ దేవ్
కేవలం మనం మాత్రమే కాదు.. అన్ని క్రికెట్ జట్లు బజ్‌బాల్ గురించి ఆలోచించాలి. కేవలం డ్రాలతో సరిపెట్టుకునే విధానానికి స్వస్తి పలికి దూకుడుగా ఆడుతూ గెలుపే పరమావధిగా ముందుకు సాగాలని కపిల్ దేవ్ కోరారు. అంతేకాదు ప్రపంచ టెస్టు క్రికెట్ జట్లకు ఇది వర్తిస్తుందని సూచించాడు. అలాంటి టైంలోనే ఆటకు మంచి ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు.కాగా వచ్చే ఏడాది జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్‌ను ఉద్దేశించి కపిల్ చేసిన కామెంట్స్ కాస్త కొత్త ప్రాధాన్యత సంతరించుకున్నాయి.