IPL: ముంబై ఇండియన్స్ కు షాకిచ్చిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్.. అంత కోపం ఎందుకంటే!

కెప్టెన్సీ మార్పునకు సంబంధించి ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయంతో హిట్ మ్యాన్ అభిమానులు షాక్ కు గురయ్యారు. జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేస్తున్నారు.

New Update
IPL: ముంబై ఇండియన్స్ కు షాకిచ్చిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్.. అంత కోపం ఎందుకంటే!

Mumbai Indians: కెప్టెన్సీ మార్పునకు సంబంధించి ముంబై ఇండియన్స్ నుంచి అనూహ్య నిర్ణయంతో హిట్ మ్యాన్ అభిమానులు షాక్ కు గురయ్యారు. ఆ జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ప్రతాపాన్ని చూపుతున్నారు.

రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతల అప్పగింత మైదానంలో ఏమేరకు ఉపయోగపడనుందో తెలియదుగానీ, సోషల్ మీడియాలో మాత్రం ముంబై ఇండియన్స్ కు గట్టి షాకే తగిలింది. లక్షలాదిగా హిట్ మ్యాన్ అభిమానులు ఆ ఫ్రాంచైజీని వివిధ సోషల్ మీడియా వేదికల్లో అన్ ఫాలో చేస్తూ ఓ రకమైన నిరసన తెలుపుతున్నారు. అన్ ఫాలో చేస్తున్న సమయంలో రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఎంతమేరకు సహేతుకమంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు ఫ్యాన్సైతే రోహిత్ శర్మ (Rohit Sharma) కోసమే ముంబై ఇండియన్స్ పేజీలను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నామంటున్నారు.

రోహిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ కు ట్విటర్‌లో 8.6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, ఇప్పుడది 8.2 మిలియన్లకు పడిపోయింది. అంటే 4 లక్షల మంది వరకూ ఫాలోవర్లు ట్విటర్ లో ముంబై ఫ్రాంచైజీని వీడారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడా ఫాలోయింగ్‌ క్రమంగా తగ్గుతోంది. కెప్టెన్ గా రోహిత్ ను తప్పిస్తున్నట్టు చేసిన ప్రకటనకు ముందు ఇన్‌స్టాలో ముంబై ఇండియన్స్ కు 13.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 12.7 మిలియన్లకు చేరింది. దీంతో అత్యధిక ఫాలోవర్లున్న ఐపీఎల్ టీంల లిస్టులో ముంబై రెండో స్థానానికి పడిపోయింది. అంటే, ఒక్క రోజు వ్యవధిలోనే నాలుగు లక్షల మంది ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేసేశారు. అయితే, మొన్నటివరకు ఇన్‌స్టాలో 13 మిలియన్ల ఫాలోవర్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్న సీఎస్కేకు ఇప్పుడు 13.1 మిలియన్ల ఫాలోవర్లు రావడం విశేషం.

ఇది కూడా చదవండి: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‎ నుంచి ద్రవిడ్ కు రెస్ట్.. హెడ్ కోచ్ ఎవరో తెలుసా?

ఈ సీజన్‌లో రోహిత్ శర్మ ఆడకపోతే ముంబై ఇండియన్స్‌ సోషల్ మీడియాలో మరింతమంది ఫాలోవర్లను కోల్పోయే అవకాశమూ లేకపోలేదు. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఫ్యాన్స్‌ రకరకాల పోస్టులు పెడుతున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ముంబై ఇండియన్స్ నుంచి ఈ ప్రకటన ఊహించలేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు అందించిన ఇలాంటి కెప్టెన్‌ ముంబైకి మళ్లీ దొరకడని కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ నిర్ణయం ఫ్రాంచైజీకి భారీగా నష్టం చేకూర్చేదే అంటున్నారు. లక్షలాది మంది అభిమానులు కెప్టెన్ గా రోహిత్ తొలగింపుపై నిరుత్సాహానికి లోనయ్యారు.

మరికొందరైతే ఇక నుంచి ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో కింది వరుసలోనే ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రిటైర్మెంట్ వరకూ రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగిస్తే బాగుండేదంటున్నారు మరికొందరు.

Advertisment
Advertisment
తాజా కథనాలు