Telangana Crime: పండుగపూట విషాదం..అల్లుడిని, కూతురిని తీసుకొస్తూ మృత్యువాత

వరంగల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు, బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాయపర్తి మండలం కిష్టాపురం క్రాస్‌ రోడ్డులో తెల్లవారుజామున చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
New Update

వరంగల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు, బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాయపర్తి మండలం కిష్టాపురం క్రాస్‌ రోడ్డులో తెల్లవారుజామున చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పండుగపూట విషాదం

వరంగల్‌ జిల్లా (Warangal district)లో పండుగపూట పెను విషాదం చోటు చేసుకుంది. 2023, అక్టోబర్ 22వ తేదీన ఆదివారం ఉదయం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం (Rayaparthi Mandal) కిష్టాపురం (Kishtapuram) క్రాస్‌ రోడ్డు దగ్గర తొర్రూరు నుంచి మోపిరాలకు వస్తున్న బైక్‌ను ఓ కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ మీద ఉన్న 50 ఏళ్ల ఓరుగంటి వెంకన్నతో పాటు అతని కుమార్తె 28 ఏళ్ల అనూష అక్కడికక్కడే మృతి చెందారు.

ఇది కూడా చదవండి: నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన రోజు 

కాగా.. అల్లుడు రాజు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజుని చికిత్స నిమిత్తం వరంగల్ హాస్పిటల్‌కు తరలించారు. పండగ కోసం అల్లుడిని, కూతురిని వెంకన్న ఇంటికి తీసుకొస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సద్దుల బతుకమ్మ, దసరా పండగలు ఉండటంతో వెంకన్న ఇద్దరినీ ఇంటికి తీసుకొస్తుండగా అనుకోని ప్రమాదం జరగడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. పండుగలకు దూరమైంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా.. బండి కూడా ధ్వంసం అయింది. ప్రమాదం చేసిన అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పరారిలో ఉన్న కారు డ్రైవర్‌ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: పండుగ పూట పెను విషాదం.. గోదావరిలో స్నానానికి దిగి..

#road-accident #warangal-district #rayaparthi-mandal #kishtapuram-cross-road
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe