విశాఖ బీచ్ రోడ్డులో ప్రమాదం.... విజయవాడలో బీభత్సం సృష్టించిన కారు..! విశాఖ భీమిలీ బీచ్ రోడ్డులో కారు ప్రమాదం జరిగింది. ఐఎన్ఎస్ కళింగ ఎర్రమట్టి దిబ్బల వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వున్న ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. By G Ramu 26 Aug 2023 in విజయవాడ వైజాగ్ New Update షేర్ చేయండి విశాఖ భీమిలీ బీచ్ రోడ్డులో కారు ప్రమాదం జరిగింది. ఐఎన్ఎస్ కళింగ ఎర్రమట్టి దిబ్బల వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వున్న ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ తీసుకు వెళ్తుండగా ప్రఖ్యాత్ అనే విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రఖ్యాత్, అఖిలేశ్, వర్ష అనే ముగ్గురు స్నేహితులు గీతం కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నారు. టిఫిన్ చేసేందుకు ఈ రోజు స్నేహితులతో కలిసి ప్రఖ్యాత్ భీమిలి నోవాటెల్ హోటల్ కు వెళ్లాడు. టిఫిన్ చేసిన అనంతరం గీతం కళాశాలకు బయలు దేరాడు. నేవల్ స్టేషన్ ఐఎన్‌ఎస్ కళింగ సమీపంలోకి చేరుకోగానే కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. కారు డ్రైవింగ్ చేసిన ప్రఖ్యాత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనతో పాటు ఇద్దరు స్నేహితులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రఖ్యాత్ మృతి చెందారు. ఇద్దరు స్నేహితుల విషమంగా వుంది. ఇది ఇలా వుంటే విజయవాడలో కేంద్రీయ విశ్వ విద్యాలయం 1వ నంబర్ గేటు వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు బారికేడ్లను ఢీ కొట్టి డివైడర్ మీదకు దూసుకుని వెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కారు డైవర్‌ను పట్టుకుని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. గుణదల కేసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారును అతివేగంగా నడపడం, సమయానికి కారును నియంత్రించలేకపోవడ వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. #road-accident #bheemili #vijaya-wada #geetham-college #novatel-hotel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి