YCP Election Campaign : 'సిద్ధం'లో మోగనున్న జగన్ ఎన్నికల శంఖారావం.. లక్షల్లో జనసమీకరణ!
ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 'సిద్ధం' పేరుతో భారీ సభలను తలపెట్టాలని వైసీపీ నిర్ణయించినా ఇవాళ భీమిలి వేదికగా తొలి సభ జరగనుంది. ఇదే సభ నుంచి వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. సభకు రెండు లక్షల మందికి పైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా.