Accident : పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా...13 మంది మృతి!

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తాపడి 13మంది మృతి చెందగా..మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా (Rajgarh) లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తాపడి 13మంది మృతి చెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన 13 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పరిస్థితి మరీ చేయి దాటిపోతుందనుకున్న వారికి మెరుగైన చికిత్స అందించేందుకు భోపాల్‌ కు తరలించినట్లు జిల్లా కలెక్టర్‌ హర్ష్‌ దీక్షిత్‌ (Harsh Dixit) తెలిపారు. అయితే వీరికి ప్రాణపాయం లేదన్నారు. రాజస్థాన్‌ నుంచి ఈ పెళ్లి బృందం వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

Also read: ఏపీలోకి రుతుపవనాలు…ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు!

Advertisment
తాజా కథనాలు