Karimnagar : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. బైక్‌పై లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులంతా ఓకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. ఈ ఘటన బోర్నపల్లి దగ్గర జరిగింది. బోనాల జాతర(Bonala Jatara) కు వెళ్లి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. జేసీబీ సహాయంతో మృతదేహాలను గ్రామస్తులు వెలికి తీశారు. అనంతరం పోలీసులుకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. మట్టిలోడ్‌తో వస్తున్న ట్రక్కు బోల్తాపడింది. అందులోని మట్టి బైక్‌పై వస్తున్న ముగ్గురిపై పడడటంతో వారు అక్కడిక్కడే మృతిచెందారు. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామం నుంచి హుజూరాబాద్‌కు మట్టితో ట్రక్కు వస్తుంది. ఈ సమయంలో బోర్నపల్లి మూలమలుపు దగ్గర డ్రైవర్ బ్రేక్ వేయడంతో ట్రక్కు అదుపుతప్పింది. ఆ సమయంలో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువతీయువకులపై మట్టి పడింది. దీంతో వెంటనే బాధితులను హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే విజయ్, సింధుజ ఇద్దరు మృతిచెందగా.. వర్ష అనే యువతి చికిత్స పొందుతూ చనిపోయిందని వైద్యులు తెలిపారు. మృతులంతా బోర్నపల్లికి చెందిన వారని గుర్తించారు. వీంరతా పెద్దమ్మతల్లి బోనాల జాతరకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింంది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: వ్యాయామం చేసేప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు తప్పదా..?