Road Accident : హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. బస్సు కింద నలిగిపోయిన ఆటో హైదరాబాద్ హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు కిందికి ఆటో చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10వ తరగతి విద్యార్థిని సాత్విక అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. By V.J Reddy 17 Aug 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad Accident : హైదరాబాద్ (Hyderabad) హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆర్టీసీ బస్సు కిందికి ఆటో చొచ్చుకెళ్లింది. వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో బస్సు కిందకు ఆటో చొచ్చుకుపోయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో బస్సు కిందకు చొచ్చుకు పోయిన ఆటోను బయటకు తీశారు. అందులో ప్రయాణిస్తున్న వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10వ తరగతి విద్యార్థిని సాత్విక అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగంగా వస్తున్న టిప్పర్ ముందు వెళ్తున్న ఆటోని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని.. టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ కు వెళ్లాల్సిన తన కూతురు తిరిగి రాని లోకానికి వెళ్లిందని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ స్థానికులను కలచివేసింది. https://rtvlive.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-17-at-10.16.36-AM.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/08/hyderabad-accident.jpg"> Also Read : మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్! #hyderabad #10th-class-student #road-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి