Rinku Singh Best Finisher : రింకూ సింగ్(Rinku Singh).. గతేడాది(2023) ఐపీఎల్(IPL) లో కొత్త సంచలనం. ఓవర్‌లో 28 పరుగులు కావాలంటే వరుసగా ఐదు సిక్సులు కొట్టిన రింకూ సింగ్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. ఓడిపోయిందనుకున్న మ్యాచ్‌ను గెలిపించి ఔరా అనిపించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) కు ఆడే రింకు 2023 ఐపీఎల్ ద్వారా లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఐపీఎల్‌లో మంచి ఫినీషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ టీమిండియా(Team India) లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనుతిరిగిచూసుకోలేదు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఈ నయా ఫనీషర్ అఫ్ఘాన్‌పై సిరీస్‌లోనూ సత్తా చాటాడు.
చివరి ఓవర్‌లో అదరహో:
బెంగళూరు(Bangalore) చిన్నస్వామి వేదికగా జరిగిన మూడో టీ20లో రింకూ సింగ్ రోహిత్‌తో కలిసి చెలరేగాడు. 39 బంతుల్లోనే 69 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇక చివరి ఓవర్ చివరి మూడు బంతులకు హ్యాట్రిక్ సిక్సులు బాదిన రింకూ తన ఫనీషింగ్ స్కిల్స్‌ను మరోసారి చూపించాడు.
రంజీల్లోనూ సత్తా చాటాడు:
నిజానికి రింకూ సింగ్ 2018 నుంచే ఐపీఎల్(IPL)లో ఉన్నాడు. అయితే పెద్ద గుర్తింపు రాలేదు. అంతగా రాణించింది కూడా లేదు. రింకూ సింగ్‌ను 2018లో రూ.80 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. మొదటి సీజన్ గొప్పగా ఆడనప్పటికీ, అతని సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని..ఐపీఎల్ 2019లోనూ కంటీన్యూ చేశారు. 2018-19 రంజీ ట్రోఫీలో రింకూ రాణించాడు. ఆ సీజన్‌లో మూడో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 10 ఇన్నింగ్స్‌లో 953 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి (163*, 149, 149, 150) పరుగులు చేశాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 15 టీ20లు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమైన స్టాట్స్ కలిగి ఉన్నాడు. 11 ఇన్నింగ్స్‌లో 89 యావరేజ్‌తో 356 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 176గా ఉంది. రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏకంగా ఏడు సార్లు నాటౌట్‌గా నిలిచాడు.
Also Read: నేను చేసింది తప్పే.. ఆలస్యంగా తెలుసుకున్నా: సమంత పశ్చాత్తాపం
WATCH: