Pakistan : రిగ్గింగ్, రీపోలింగ్ రగడ.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్!

పాక్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఆలస్యం కావడంతో రిగ్గింగ్‌ జరిగిందంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన 'పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్'తో సహా పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. రిజల్ట్ వెలువడని ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్ విధించారు.

New Update
Pakistan : రిగ్గింగ్, రీపోలింగ్ రగడ.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్!

Pakistan Elections : పాక్ సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిదంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌(Imran Khan) కు చెందిన 'పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్'(PTI) సహా పలు రాజకీయ పార్టీల మద్దతుదారుల నిరసనల చేపట్టారు. దీంతో పాకిస్థాన్ ఎన్నికల సంఘం(ECP) కొన్ని పోలింగ్ స్టేషన్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించింది. ఫిబ్రవరి 15న రీ-పోలింగ్ షెడ్యూల్ చేయబడింది. దాదాపు 10 స్థానాలకు కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. అయితే శాంతి భద్రత దృష్ట్యా ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్ విధించగా దీనికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ ధర్నాలకు దిగింది.

శాంతియుత నిరసనలు..
ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్(Pakistan) తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఫలితాలు వెలువడని ప్రాంతాల్లో శాంతియుత నిరసనలను నిర్వహిస్తామని ప్రకటించింది. శనివారం అర్ధరాత్రిలోగా పూర్తి ఫలితాలు ప్రకటించాలని, లేనిపక్షంలో నిరసనలు ఎదుర్కోవాలని ఎన్నికల సంఘాన్ని పార్టీ కోరింది. అయితే ప్రకటన జారీ చేసిన కొన్ని గంటల్లోనే పెషావర్, కరాచీలో పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలను ఊపుతూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత ఫలితాలు ఇంకా ప్రకటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి : Delhi : ‘ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చిన రైతులు.. బార్డర్లు మూసేసిన ప్రభుత్వం

సంకీర్ణ ప్రభుత్వానికి దారి..
దేశంలో హంగ్ పార్లమెంటు(Hung Parliament) లేదా సంకీర్ణ ప్రభుత్వానికి దారితీస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇప్పటివరకు వెలువడిన అప్‌డేట్‌ల ప్రకారం.. నేషనల్ అసెంబ్లీలో PTI మద్దతు ఉన్న ఇండిపెండెంట్లు 101 స్థానాల్లో సింహ భాగం గెలుచుకున్నారని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) 73 సీట్లు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) 54 స్థానాలతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు గరిష్ట సంఖ్యలో స్థానాలను గెలుచుకున్నారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, రాష్ట్రపతి వారిని వీలైనంత త్వరగా ఆహ్వానిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisment
తాజా కథనాలు