Telangana:రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. రూ.32 వేల కోట్ల రుణమాఫీకి సర్కారు ప్రణాళిక మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయగా.. ఈ పథకం అమలుతో సుమారు 30 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు.

New Update
Telangana:రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

Telangana: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రూ.32 వేల కోట్ల రుణమాఫీకి సర్కారు ప్రణాళిక మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయగా.. ఈ పథకం అమలుతో సుమారు 30 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. ఈ మేరకు అసలు, వడ్డీ కలిపి ఒక్కో రైతుకు రూ. 2లక్షల వరకు మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక నేరుగా ప్రభుత్వమే ఇందుకు సంబంధించిన లావాదేవీలను బ్యాంకులకు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.

రూ. 32 కోట్ల రుణమాఫీ..
ఈ మేరకు అసలు, వడ్డీ కలిపి ఒక్కో రైతుకు రూ. 2లక్షల వరకు మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక నేరుగా ప్రభుత్వమే ఇందుకు సంబంధించిన లావాదేవీలను బ్యాంకులకు చెల్లించేలా అధికారుల చర్యలు చేపట్టినట్లు సీఎం రేవంత్ తెలిపారు. మొత్తం రూ. 32 కోట్ల రుణమాఫీ చేయాల్సివుండగా దానిని 52 నెలలుగా ఇన్ స్టాల్ మెంట్ చేసుకుంటానని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.  అప్లికేషన్స్ మొత్తం క్లియర్ అయినతర్వాత ఈ ప్రక్రియ పూర్తిచేస్తానన్నారు. ఇప్పటికే 25 లక్షలమంది ఖాతాలో డబ్బులు వేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.  అదే సమయంలో రైతుబంధు అమల్లోనూ సీలింగ్ పైన కసరత్తు చేస్తున్నారు.  రైతు రుణమాఫీ కోసం కార్పోరేషన్ ఏర్పాటు తో పాటుగా నిధుల సమీకరణపై కూడా ఆయన అధికారులతో చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు.

39 లక్షల మంది రైతులు..
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు బ్యాంకులు, వ్యవసాయ సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్నారు. అయితే రాష్ట్ర అర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని అమలు మార్గాలపైన కసరత్తు మొదలు పెట్టిన సర్కార్.. అధికారుల నుంచి ప్రభుత్వం పూర్తి లెక్కలు రాబడుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్ల వరకు బ్యాంకుల్లో అప్పులు ఉన్నట్లు అధికారులు తేల్చారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేనాటికి పంట పెట్టుబడి సాయంగా రైతులు సుమారు రూ.32 వేల కోట్లు తీసుకున్నారని, ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. రుణ మాఫీ అమలుకు మార్గదర్శకాలను స్క్రీనింగ్ చేస్తే దాదాపు 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు

ఇది కూడా చదవండి : Tata Group : లక్షద్వీప్‌ టూరిజానికి సంబంధించి కీలక ప్రకటన చేసిన టాటా గ్రూప్‌!

వాయిదాల పద్ధతిలో..
ఇందుకోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయగా దీని ద్వారా ముందుగా బ్యాంకు నుంచి రైతురుణమాఫీకి కావాల్సిన నిధులు సమీకరించి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రభుత్వ ఆదాయ శాఖలైన రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ రెవిన్యూ నుంచి 1శాతం నిధులను ఆ కార్పోరేషన్ కు ట్రాన్స్ ఫర్ చేసి మూడేళ్ల కాలంలో బ్యాంకులో ప్రభుత్వ రుణం క్లియర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రైతుల పేరుమీద ఉన్న అప్పుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదికి బదలాయించుకుని.. ఆ తర్వాత లాంగ్‌ టర్మ్‌ పెట్టుకొని వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు అసలు, వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు