Gaddar Jayanthi : నా మాటే శాసనం .. గద్దర్ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ జయంతి వేడుకల్లో నంది అవార్డుల పేరును గద్దర్‌ అవార్డుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై గద్దర్‌ జయంతి రోజు కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డులు ప్రధానం చేస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

Gaddar Jayanthi : నా మాటే శాసనం .. గద్దర్ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
New Update

Gaddar Awards: తన పాటతో  జన జీవనాన్ని  చైతన్యపరిచి..బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిర్విరామకృషి చేసి, సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి (Gaddar Jayanthi ) వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొని గద్దర్కు నివాళులు అర్పించారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న అని ఆయన గొప్పవ్యక్తిత్వాన్నిరేవంత్ రెడ్డి కొనియాడారు.

త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలు పెట్టిన వ్యక్తి గద్దరన్న అని ..త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదనే ఉద్దేశ్యంతో మళ్లీ ఉద్యమం మొదలు పెట్టింది గద్దరన్న అని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలు మాకు  ఎల్లపుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. గద్దర్ తో మాట్లాడిన ప్రతీ మాట మాకు  వెయ్యేనుగుల బలంగా ఉంటుందని , ఆ బలంతోనే గడీల ఇనుప కంచెల బద్దలు కొట్టి ప్రజాప్రభుత్వంలో జ్యోతిరావు పూలే భవన్ గా మార్చామని అన్నారు.

దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ 

ఇక.. దళితులకు అగ్రస్థానం కల్పిస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ మాటలు గుర్తుచేస్తూ..ఏ దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మోసం చేశారో...మా ప్రజా ప్రభుత్వంలో ఆ దళితుడికే వచ్చి ఎమ్మెల్సీ కవిత పూలే విగ్రహం కోసం వినతిపత్రం ఇచ్చారని, ఎవరైనా వచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో ఉందని అన్నారు.

గద్దరన్న విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు

గద్దరన్న విగ్రహాన్ని (Gaddar Statue) ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయాన్నీ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఇక.. ప్రతిపక్షనాయకుల గురించి మాట్లాడుతూ .. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకులు శపనార్ధాలు పెడుతున్నారని అన్నారు. ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారు...అలాంటి ఆలోచన చేసిన వారిని తెలంగాణ ప్రజలు ఘోరీ కడతారు.అది వాళ్ల ఒంటికి.. ఇంటికి మంచిది కాదంటూ మండిపడ్డారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని . ఐదేళ్లు సుస్థిరమైన పాలన అందించే బాధ్యత మాది అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు.

నంది అవార్డుల పేరును గద్దర్‌ అవార్డుగా మారుస్తూ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ జయంతి వేడుకల్లో నంది అవార్డుల (Nandi Awards) పేరును గద్దర్‌ అవార్డుగా (Gaddar Awards) మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై గద్దర్‌ జయంతి రోజు కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డులు ప్రధానం చేస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ వేదికగా చెబుతున్నా.. ఇదే శాసనం.. ఇదే జీవో..అంటూ రేవంత్ రెడ్డి జీవో పాస్ చేశారు. ఈ పురస్కారాలతో ఆయన్ను స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు ఉండాలనే  ఉద్దేశ్యంతో  తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్భయం తీసుకుందని అన్నారు.  రవీంద్రభారతిలో ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలకు గాయకులు,కళాకారులు గద్దర్ పాటలను పాడుతూ ఆయన జ్ఞాపకాలు స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.స‌మాజంలో ఉన్న అంత‌రాలు తొల‌గించాల‌ని త‌న జీవితాంతం ప‌రిత‌పించి, త‌న గ‌ళంతో జనాలలో చైతన్య స్ఫూర్తిని రగిలించారని ఈ సంద‌ర్భంగా గ‌ద్ద‌ర్ సేవ‌లను గుర్తు చేశారు.

ALSO READ :గద్దరన్న జీవితమే ఓ పోరాటం-జనసేన

#cm-revanth-reddy #folk-singer-gaddar #gaddar-jayanthi #gaddar-jayanthi-celebrations #gaddar-awards
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe