Election Code : తెలంగాణ (Telangana) లో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) పై కసరత్తు ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఎన్నికల కోడ్ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై ఫోకస్ పెట్టింది. మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ ఇచ్చింది. ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు 82.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. ఏడాదికి 4.50లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో 22.50లక్షల ఇళ్లు నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా లబ్ధిదారుల ఎంపిక అధికారులకు సవాల్‌గా మారింది. ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దరఖాస్తులతో పోలిస్తే మంజూరు చేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు.
Also Read : హైదరాబాద్‌లో మర్డర్ లైవ్ వీడియో