Indiramma Housing Scheme : ముగిసిన ఎన్నికల కోడ్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్ TG: ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. ఏడాదికి 4.50లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 14 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Election Code : తెలంగాణ (Telangana) లో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) పై కసరత్తు ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఎన్నికల కోడ్ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై ఫోకస్ పెట్టింది. మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ ఇచ్చింది. ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు 82.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. ఏడాదికి 4.50లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో 22.50లక్షల ఇళ్లు నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా లబ్ధిదారుల ఎంపిక అధికారులకు సవాల్‌గా మారింది. ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దరఖాస్తులతో పోలిస్తే మంజూరు చేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. Also Read : హైదరాబాద్‌లో మర్డర్ లైవ్ వీడియో #telangana #indiramma-housing-scheme #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి