Revanth Keeps His Promise : తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM)గా ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియం వేదికగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. 6 గ్యారంటీలు, రజినీకి ఉద్యోగంపై సంతకం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తల కేరింతలు మధ్య ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో కలిసి ప్రత్యేక వాహనంలో రేవంత్ వేదిక వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
పూర్తిగా చదవండి..మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి.. రెండు ఫైళ్లపై సంతకం
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియం వేదికగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. 6 గ్యారంటీలు, రజినీకి ఉద్యోగం ఫైళ్లపై సంతకం చేశారు.
Translate this News: