కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్నది కేసీఆర్ బీనామీలే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy Sensational Comments On KCR: రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. తనకు సెక్యూరిటీ తగ్గించటం దగ్గర నుంచి, బీఆర్ఎస్, బీజేపీల బంధం గురించి మాట్లాడారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్నది కేసీఆర్ బీనామీలే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
New Update

Revanth Reddy Sensational Comments On KCR: కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్నది బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ బీనామీలే అని వ్యాఖ్యానించారు రేవంత్. ఆర్టిఫీషియల్ బూమ్ క్రియేట్ చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు అద్భుతమైన నాటకం ఆడారు అన్నారు. అసలు కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్న సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగేలా బీఆర్ఎస్ నేతలు ఎదిగారు. పేద ప్రజలు మాత్రం పేదలుగానే ఉంటున్నారని వ్యాఖ్యానించారు.

సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వస్తా 

ప్రభుత్వం రేవంత్ కు గతంలో 4+4 ఉండే సెక్యూరిటీని తర్వాత 2+2కి కుదించి, ఇప్పుడు పూర్తిగా తొలగించిందనే ప్రచారం సాగుతోంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు రేవంత్ ఘాటుగానే స్పందించారు. ''కోర్టు చెప్పినా ప్రభుత్వం నాకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు.

ఎంపీగా ఉన్నాను, జాతీయ పార్టీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చాం. నేను ప్రజల మనిషిని.నాకు సెక్యూరిటితో పనిలేదు" అని వివరించారు. నేను సెక్యూరిటీ లేకుండ ఎక్కడికైనా వస్తాను. కేసీఆర్ సెక్యూరిటీ లేకుండ ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు రాగలరా? అని ప్రశ్నించారు.

లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ అన్నారు. ''లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నా సైన్యం. నా సెక్యూరిటీ వాళ్ళే"అని స్పష్టం చేశారు రేవంత్. తనను ఓడించడానికి కేసీఆర్ పోలీసులను వాడుకున్నారని, సెక్యూరిటీ విషయంలో తనను భయపెట్టాలని చూస్తే భయపడేవాడిని కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ,మైనార్టీ అనే తేడా ఉండదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ మైనార్టీల కోసం ఏం చేయలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఒక్క శాతం కూడా మైనార్టీలకు దక్కలేదు అన్నారు. కేసీఆర్ మైనార్టీ ఓట్లను బీజేపీకి అమ్ముకోవటంతో ఎక్కువ మంది మైనార్టీలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారని అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..

బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదు.ఇక్కడ కారు బయల్దేరి ఢిల్లీకి చేరే వరకు అది కమలంగా మారిపోతోంది. ఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే

బీజేపీ తెచ్చిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకి కేసీఆర్ మద్దతు ఇచ్చారు.

బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడానికి ఎక్కడికైనా వస్తాం.

బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుడి, మసీదు, చర్చి ఎక్కడికైనా వచ్చి చెప్తాం. బీఆర్ఎస్ వాళ్ళు అలా చెప్పగలరా?

అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు.తాబేదార్ల పేర్లు రెడ్ బుక్ లో రాస్తాం. మా పార్టీ

అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం. నేను అనేది ప్రభాకర్ రావు, రాధ కిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారులనే. ప్రజల కోసం పనిచేసే అధికారులపై నాకెప్పుడూ గౌరవం ఉంటుంది

Also Read: టీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఇలా చేయాల్సిందే? 25 వరకూ గడువు

#revanth-reddy-sensational-comments-on-kcr #revanth-reddy-comments-on-kcr #brs-party #congress-party #revanth-reddy #tpcc-chief-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe