Revanth Reddy: ధరణి బదులుగా కొత్త యాప్.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ఎటిఎంలా వాడుకుంటుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేసి.. దాని స్థానంలో కొత్త యాప్ ను ప్రవేశపెడుతామని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Revanth Reddy: ధరణి బదులుగా కొత్త యాప్.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

TS Elections: మరో 23రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కేసీఆర్(KCR) ప్రచారాల్లో బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలను విమర్శిస్తూ జెట్ స్పీడులో ముందుకు పోతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కేసీఆర్ కు ఏమాత్రం తగ్గకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Also Read: ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం?

ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌(Alampur)లో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ధరణి(Dharani) పోర్టల్‌ కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ ను రద్దు చేసి దాని స్థానంలో కొత్త యాప్ ను ప్రవేశపెడుతామని అన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి 24గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్.. అది నిజమని నిరూపిస్తే తాను నామినేషన్‌ వేయనని సవాల్‌ విసిరారు. అసలు రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.

కేసీఆర్.. నీకు దమ్ముంటే నేను రైతులకు మూడు లేదా ఐదు గంటల కరెంట్ ఇస్తామని చెప్పినట్టు నిరూపించాలని డిమాండ్ చేశారు. ఓడిపోతామనే భయంతో కేసీఆర్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారితో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ఈ తుగ్లక్ పాలనకు చెక్ పెట్టాలని రేవంత్ పేర్కొన్నారు. జోగులాంబ ఆలయం అభివృద్ధి గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అలంపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌(Sampath Kumar)ను భారీ మెజార్టీతో గెలిపించాలని అక్కడి ఓటర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Also Read: రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్!

Advertisment
తాజా కథనాలు