Revanth Reddy: గువ్వల బాలరాజుపై దాడి.. ప్రశాంత్ కిషోర్ ఆడిస్తున్న డ్రామా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గువ్వల బాలరాజు దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గువ్వల బాలరాజుపై దాడి జరగడం ప్రశాంత్ కిషోర్ ఆడుతున్న ఒక డ్రామా అని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిపించారని ఆరోపించారు.

Revanth Reddy: కేసీఆర్‎ను పొలిమేరలు దాటే వరకు తరమాలి.. రేవంత్ ఘాటు వ్యాఖ్యలు..
New Update

TS Elections: అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై నిన్న (శనివారం) జరిగిన దాడిపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గువ్వల బాలరాజుపై దాడి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆడిస్తున్న ఒక డ్రామా అని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిపించారని ఆరోపించారు. ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణం అని తెలిపారు. ఏపీలో కోడికత్తి ఘటన, బంగాల్‌లో మమతా బెనర్జీ కాలి గాయం ఘటన ఇందుకు ఉదాహరణలు అని రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి, గువ్వల బాలరాజుపై దాడి ఘటనలు కుట్రలో భాగమే అని ఆరోపించారు.

ALSO READ: బిగ్ బాస్ ఫేమ్, నటి అరెస్ట్.. ఎందుకంటే?

గువ్వల బాలరాజును ఇవాళ కేటీఆర్ పరామర్శించి కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గువ్వల బలరాజే కనిపించిన వారిపై దాడి చేశారని అన్నారు. గువ్వల బాలరాజు డబ్బులు పంచడానికి వెళ్తున్నారని కాంగ్రెస్ నేతలు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే.. పోలీసులు గువ్వలను అడ్డుకోకుండా కాంగ్రెస్ నేతలపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కొత్త ప్రభాకర్ పై దాడి జరిగినప్పుడు హరీష్ రావు బాగా నటించారని అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడిలో కాంగ్రెస్ ప్రమేయం లేదని ఆ జిల్లా ఎస్పీ చెప్పిందని.. కేవలం సెన్సషన్ కోసం ఈ దాడి జరిగినట్లు అక్కడి ఎస్పీ వెల్లడించారని అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడిలో ఇప్పటి వరకు రిమాండ్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. మరో 15రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయని కేటీఆర్ అంటున్నారు.. కేటీఆర్ ప్రకటనపై ఎన్నికల సంఘం అధికారులు సూమోటోగా కేసు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

మేడిగడ్డ కుంగినప్పుడు కుట్ర ఉందని మొదట చెప్పి.. తర్వాత కేంద్ర అధికారులు నిర్వహణ లోపం అంటున్నారని విమర్శించారు. ఫ్యాక్స్ కాన్ పై మంత్రి కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. కర్ణాటకలో బీఆర్ఎస్, ఎంఐఎం, జేడీఎస్ కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు చేసిన కుట్రలు విఫలం అయ్యాయని అన్నారు. కుమారస్వామి ప్రెస్ మీట్ హరీష్ రావు డైరెక్షన్ లో నడిచిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు హ్యాక్ అవుతుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ డిమాండ్ చేశారు.

#revanth-reddy #telangana-elections #guvvala-balaraju-attack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe