టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అతినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, అది ఎన్నికల కమీషన్ కిందకు వస్తుందని దాఖలైన పిటీషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో దీనిపై రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ రేవంత్ రెడ్డి వేసిన పిటీషన్‌ను కొట్టివేసింది. దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీంతో ఇవాళ ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఈ పిటీషన్‌ను కొట్టివేసింది. కాగా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఏడాది తర్వాత తెలంగాణ టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ను కోరారు. దీనికి ఆయనకు 50 లక్షల రూపాయలను ఇవ్వబోయారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఈ దృష్యాలను రికార్డ్ చేసిన ఎమ్మెల్యే.. సీఎం కేసీఆర్‌కు పంపారు. దీంతో ఇది అప్పట్లో పెను సంచలనంగా మారింది. పోలీసులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆ సమయంలో పోలీసులు రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఎవరు ఇంత డబ్బు ఇచ్చారని ప్రశ్నించగా.. తనకు ఈ డబ్బును తన బాస్ ఇచ్చాడని రేవంత్ రెడ్డి బదులు ఇచ్చాడు. కానీ తన బాస్ ఎవరనేది ఆయన చెప్పలేదు. కాగా రేవంత్ రెడ్డి పట్టుబడ్డ సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు స్టీఫెన్సన్‌తో ఫోన్లో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. దీంతో ఇది కూడా అప్పట్లో పెను సంచలనంగా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఒక సీఎం ఫోన్ ట్యాంపరింగ్ చేస్తారా.. అని ప్రశ్నించారు. తెలంగాణకు మీరు ముఖ్యమంత్రి కాదని సోషల్ మీడియాలో చంద్రబాబుపై ట్రోలింగ్‌కు గురయ్యాడు.
ALSO READ: తెలంగాణ బీఎస్పీ అభ్యర్థుల లిస్ట్ విడుదల.. అక్కడి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ!