ధరణిలో లోపాలు.. రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం జరగనుండగా పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ధరణి ప్లేస్ లో 'భూమాత'పేరుతో కొత్త పోర్టల్ తీసుకొచ్చే అవకాశం ఉంది.

New Update
ధరణిలో లోపాలు.. రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఇదే

ధరణి వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం జరగనుండగా పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ మేరకు ధరణిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటున్న గతంలో చెప్పిన కాంగ్రెస్ నేడు కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా భారీ మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ధరణి ప్లేస్ లో 'భూమాత'పేరు కొత్త పోర్టల్ తీసుకురాబోతున్నట్లు సమాచారం.

ఇక ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణలో కొన్ని వేల ఎకరాలు లెక్కలేకుండా పోయాయని, ఆ భూములన్నీ ఎలా మాయమైపోయాయనే అంశంపై సీఎం రేవంత్ లోతుగా చర్చ జరపబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో 4, 5 ఎకరాలున్న రైతులకు ధరణిలో కొన్ని గుంటల భూమి తక్కువ చూపించిందంటూ ఇప్పటికే వేల సంఖ్యలో కంప్లైట్ వచ్చాయని, ఈ అవకతవకలెందుకు జరిగాయని రేవంత్ అధికారులను ప్రశ్నించనున్నారు. అలాగే పట్టాలో ఉన్న లెక్కల ప్రకారం ధరణిలో చూపించకుండా పోయిన భూమి ఎక్కడికి వెళ్లింది? దీనికి కారకులేవరు? అనే అంశాలను పరిశీలించి అక్రమార్కులపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక తెలంగాణలో ప్రభుత్వ భూములు కొన్నివేల ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని, దుబాయ్, సింగపూర్, తదితర దేశాల నుంచి వారంతా అపరేట్ చేస్తున్నట్లు తెలుస్తుండగా.. కొన్ని ఎకరాల భూములను ధరణిలో కనిపించకుండా హైడింగ్ లో ఉంచుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

Also read : congress government:పేదలకు ఇళ్ళ పంపకాలపై ఫోకస్..ధరణి పేరులో మార్పు?

అంతేకాదు 15, 20 ఏళ్ల కింద అమ్మిన భూమి మళ్లీ పాతవాళ్ల పేరిట రిజిస్టర్ అయినట్లు ఆరోపణలున్నాయని, పాస్ బుక్ పట్టాలో అవకతవకల మతలబు ఏమిటనే విషయంపై చర్చ జరగనుంది. మన ఆస్తులు, భూముల వివరాలు ప్రైవేట్ వ్యక్తుల్లోకి ఎలా వెళ్లాయనే అంశాన్ని కూడా పరిశీలించి దీనిపై కొత్తగా కమిటీ వేసి అవినీతిని బయటకు తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బుధవారం సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే విషయంపై స్పష్టత రానుంది. అలాగే ధరణి పూర్తిగా రద్దు చేసి అత్యుధునికమైన సాంకేతికతతో 'భూ మాత'పోర్టల్ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు