Telangana Congress: కాంగ్రెస్‌ హామీలను కాపీ కొట్టారు.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..

కాంగ్రెస్‌ ఇచ్చిన హమీలను కాపీ కొట్టి సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించగానే కేసీఆర్‌ తమ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చారని.. 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌ 51 మందికే బీఫారాలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు.

Telangana Congress: కాంగ్రెస్‌ హామీలను కాపీ కొట్టారు.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..
New Update

Telangana Congress: కాంగ్రెస్‌ ఇచ్చిన హమీలను కాపీ కొట్టి సీఎం కేసీఆర్‌(CM KCR) బీఆర్‌ఎస్‌(BRS) ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించగానే కేసీఆర్‌ తమ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చారని.. 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌ 51 మందికే బీఫారాలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలు చూడగానే సీఎం కేసీఆర్‌కు చలిజ్వరం వచ్చిందని, ఇతర పార్టీల మేనిఫోస్టోలను కాపీ కొట్టేందుకే ఆయనకు సమయం సరిపోతోందన్నారు. కేసీఆర్‌ నిరంతరం మద్యం, మైనింగ్‌, ల్యాండ్‌ మాఫియా ద్వారా ఎలా సంపాదించాలనే ఆలోచనలు చేస్తుంటారని, కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలనే కేసీఆర్‌ ఒక్కో వెయ్యి పెంచుతూ కాపీ కొట్టారని విమర్శించారు. స్వంతంగా ఆలోచన చేసే శక్తిని కేసీఆర్‌ కోల్పోయారని, పరాన్నజీవిగా మారిపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలు అసాధ్యం అని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు మేనిఫెస్టోలో ఎలా పెట్టారని ప్రశ్నించారు. ఒకప్పుడు కేసీఆర్‌ అడుగుల్లో ఇతర పార్టీలు నడుస్తాయని అనేవారని, ఆలోచనలు క్షీణించిన కేసీఆర్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ను అనుసరిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హతను బీఆర్‌ఎస్‌ నేతలు కోల్పోయారని, ఓటర్లకు చుక్క మందు పోయకుండా, అణాపైసా పంచకుండా ఎన్నికల్లో కొట్లాడుదామని సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. దీనిపై 17వ తేదీ మధ్యాహ్నం అమర వీరుల స్థూపం వద్ద .. మేం ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేయబోమని ప్రమాణం చేస్తామని, కేసీఆర్‌ కూడా వచ్చి ప్రమాణం చేయాలని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టో..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ థాక్రే విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పథకాలను కాపీ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, 6 గ్యారెంటీ కార్డులను కేసీఆర్ కాపీ కొట్టారని, మా మేనిఫెస్టోలో అన్ని సాధ్యమయ్యే పథకాలే ఉంటాయని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీ మూడు రోజుల పాటు 18, 19, 20 తేదీల్లో రాష్ర్టంలో పర్యటించనున్నారని మాణిక్‌ రావ్‌ థాక్రే తెలిపారు. ములుగు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ఉంటుందని, మహిళా డిక్లరేషన్‌లో రాహుల్, ప్రియాంక ప్రసంగిస్తారని తెలిపారు. పెద్దపల్లిలో భారీ బహిరంగ సభ ఉంటుందని, కరీంనగర్‌లో పాదయాత్ర, బహిరంగ సభ ఉంటుందన్నారు. జగిత్యాలలో రాహుల్‌ గాంధీ రైతులతో మాట్లాడుతారని, నిజామాబాద్‌లో పాదయాత్ర, బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. చివరిగా ఆర్మూర్‌లో రైతులతో రాహుల్ సమావేశం ఉంటుందని అని థాక్రే తెలిపారు.

Also Read:

CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్

చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ తీరు అమానవీయం..పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

#congress #revanth-reddy #brs #cm-kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe