Revanth Reddy: 'కాళేశ్వరం'పై సిట్టింగ్ జడ్జితో విచారణ.. నేరుగా కేసీఆర్, హరీశ్ కు గురి పెట్టిన రేవంత్?

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ నిన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. దీంతో నీటి పారుదల శాఖ బాధ్యతలు చూసిన హరీశ్, కేసీఆర్ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

New Update
Revanth Reddy: 'కాళేశ్వరం'పై సిట్టింగ్ జడ్జితో విచారణ.. నేరుగా కేసీఆర్, హరీశ్ కు గురి పెట్టిన రేవంత్?

సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి (CM Revanth Reedy) అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) డ్యామేజీ అంశాలపై ఆయన ఫోకస్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ఈ అంశాలపై విచారణకు ఆయన సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల (Medigadda Barrage) నిర్మాణం అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని నిన్న మండలిలో ప్రకటించి సంచలనం సృష్టించారు రేవంత్. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను (ఎమ్మెల్యే &ఎంఎల్సీ) మేడిగడ్డ పర్యటనను తీసుకువెళ్తానని తెలిపారు. బ్యారేజ్ ఎందుకు కుంగిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది తెలుసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి: Khammam Politics: ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లో మస్త్ పోటీ.. రేసులో రేణుకా, వీహెచ్ తో పాటు ఇంకా ఎవరంటే?

కాళేశ్వరం ప్రోజెక్టు మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తామన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు? వారి వెనుక ఉన్న మంత్రులు..? ఎవరు? అప్పుడు అన్ని విషయాలు విచారణలో బయటకు వస్తాయన్నారు. రేవంత్ ఈ ప్రాజెక్టు విషయంపై మాట్లాడుతుండగా.. ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నప్పుడు విచారణ చేసుకోవచ్చుగా అంటూ ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు.

దీంతో స్పందించిన రేవంత్ రెడ్డి కవిత మంచి సూచన చేశారని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి.. కాంట్రాక్ట్ ఇచ్చిన వారిని, సంబంధిత శాఖ మంత్రులను, కాంట్రాక్టర్లను చట్ట ప్రకారం ఎలా శిక్షించాలో అలా శిక్షిస్తామన్నారు రేవంత్. దీంతో ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ మొదటి సారి అధికారం చేపట్టిన సమయంలో హరీశ్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. సెకండ్ టర్మ్ లో సీఎం కేసీఆర్ ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. దీంతో ఆ ఇద్దరిని కూడా విచారించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు