Telangana Elections: 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వాన్ని ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ (CM KCR) పోటీ చేసే గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థిని బరిలో దించేందుకు వ్యూహాలు రచిస్తోంది. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్(KCR)పై పోటీ చేసేందుకు బీజేపీ ఈటల రాజేందర్(Etela Rajender)ను బరిలోకి దించగా.. కాంగ్రెస్ తూముకుంట నర్సారెడ్డి(Thumkunta Narsareddy)ని బరిలోకి దించనుంది.
Also Read: నేను పోటీ చేయకపోవడానికి కారణం ఇదే.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అయితే కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థిని పెట్టాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్ అధిష్టానం. సీనియర్లతో చర్చల అనంతరం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని బరిలో దించేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఓకే అన్నట్లు సమాచారం. ఇప్పటికే కొడంగల్ టికెట్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కేటాయించిన సంగతి తెలిసిందే. ఈనెల 10న కామారెడ్డిలో జరిగే BC డిక్లరేషన్ సభలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదేరోజు రేవంత్ రెడ్డి నామినేషన్ కూడా వేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Also Read: ఎమ్మెల్యే రాజాసింగ్ ఆస్తులు ఎంతో తెలుసా?
రేవంత్ రెడ్డి పోటీతో కామారెడ్డికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌అలీకి కాంగ్రెస్ అధిష్టానం నిజామాబాద్ అర్బన్ టిక్కెట్టు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక బాన్సువాడ కాంగ్రెస్ టిక్కెట్టును ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డికి ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.