Retirement Plan For Youth : ఇప్పటి యువత(Youth) భవిష్యత్ కోసం చాలా ఎక్కువ ఆలోచనలు చేస్తోంది. ఉద్యోగంలో చేరిన వెంటనే.. రిటైర్మెంట్ కోసం ఎలా డబ్బు పొదుపు చేసుకోవాలి అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. దీనికోసం కొంతమంది నెలవారీ పొదుపు చేయడం(EMI) ప్రారంభిస్తే, మరికొందరు పెన్షన్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పెట్టుబడి ఎంపికలలో రాబడి లెక్కలు వేటికవి భిన్నంగా ఉంటాయి. మీరు స్టాక్ మార్కెట్ గురించి చూసినట్లయితే.. రాబడి 200-1000 శాతం వరకు ఉండొచ్చు. ఒక్కోసారి అసలుకే ఎసరు రావచ్చు. ఊరికే అలా.. స్టాక్‌పై బెట్టింగ్ చేయడం ద్వారా రాబడిని అంచనా వేయడం అంత సులభం కాదు. మీరు దీన్ని స్థిర ఆదాయంగా చూడలేరు. కానీ ఈ రోజుల్లో చాలామంది మార్కెట్‌తో పరోక్షంగా అనుసంధానించిన నిధులను స్థిర ఆదాయంగా చూడటం ప్రారంభించారు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక పద్ధతి గురించి చెప్పుకోబోతున్నాం. దీని సహాయంతో మీరు ఈ రోజు కేవలం రూ. 3 లక్షలు పెట్టుబడి ఒకేసారి పెట్టి.. మీరు రిటైర్ అయ్యే వరకు దాని గురించి మరచిపోండి. మీ రిటర్న్ మీ నెలవారీ పెన్షన్‌గా(Retirement Plan) ఎలా ఉపయోగపడుతుందో అప్పుడు అర్ధం అవుతుంది.
పూర్తిగా చదవండి..Retirement Plan : ఒక్కసారి మూడులక్షలు పెడితే చాలు.. నెలకు 31 వేల రూపాయల పెన్షన్..
మీరు 25 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరితే, తరువాత ఐదేళ్ళలో 3 లక్షలు పొదుపు చేసి..ఆ మొత్తాన్ని తరువాతి 20 ఏళ్లకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. అప్పుడు వచ్చిన మొత్తాన్ని fd చేసుకుంటే మీకు 50 ఏళ్ల వయసు నుంచి నెలకు 30 వేల రూపాయలు వస్తాయి. పూర్తి లెక్క ఇక్కడ చూడండి
Translate this News: