Retired Army Officer Got Heart Attack During a Performance: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యోగా క్యాంపులో రిటైర్డ్ ఆర్మీ అధికారి దేశభక్తి పాటకు ప్రదర్శన ఇస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన పాటకు తగ్గట్టుగానే ప్రదర్శిస్తున్నారని స్టేజ్ కింద ఉన్న చిన్నారులు చప్పట్లు కొడతూనే ఉన్నారు. కానీ ఆ ఆర్మీ ఆఫీసర్ నిజంగానే గుండెపోటుతో కుప్పకూలి అక్కడిక్కడే మృతి చెందారు.
Also Read: తన ఫోన్ తీసుకున్నాడని భర్తకు చుక్కలు చూపించిన భార్య..!
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌లోని ఆస్తా యోగా క్రాంతి అభియాన్ అనే గ్రూప్.. ఓ ఫ్రీ యోగా క్యాంపును ఏర్పాటు చేసింది. ఈ క్యాంపుకి రిటైర్ట్ ఆర్మీ ఆఫీసర్ అయిన బల్విందర్ సింగ్ ఛబ్రా వచ్చారు. అక్కడ వేదికపై 'మా తుజే సలాం' అనే దేశభక్తి పాటకు ఆయన డ్యాన్స్ చేస్తున్నారు. చేతిలో జాతీయ జెండా పట్టుకుని పాటకు తగ్గట్టు ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు. మూడు నిమిషాల తర్వాత బల్విందర్ చేతిలో జెండా పట్టుకునే అకస్మాత్తుగా కుప్పకూలారు.
ఆయన పాటకు తగ్గట్టుగానే ప్రదర్శిస్తున్నారని అనుకుని.. వేదిక కింద ఉన్న చిన్నారులు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. కొంత సేపటి తర్వాత కూడా ఆయన లేవలేదు. ఆ తర్వాత అక్కడున్న వాళ్లు వచ్చి చూడగా బల్విందర్ గుండెపోటుతో అక్కడిక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే 2008లో బల్విందర్ సింగ్ బైపాస్ సర్జరీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: వామ్మో.. నువ్వేం కూతురువమ్మా.. తండ్రిని, తమ్ముడిని ముక్కలు ముక్కలుగా నరికీ..!