Vijayawada: కృష్ణలంకను ఆదుకున్న రిటైనింగ్ వాల్..

విజయవాడలోని కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. ఇందుకు కారణం అక్కడ రిటైనింగ్‌ వాల్ ఉండటమే. మొత్తం 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా ఈ ప్రహారి గోడ నిర్మించారు.

Vijayawada: కృష్ణలంకను ఆదుకున్న రిటైనింగ్ వాల్..
New Update

భారీ వరదల వల్ల వరద ప్రభావానికి విజయవాడ అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. అయితే కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. ఇందుకు కారణం అక్కడ రిటైనింగ్‌ వాల్ ఉండటమే. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే.. కృష్ణలంకతో పాటు రాణిగారి తోట మునిగిపోయే పరిస్థితి ఉండేది. మొత్తం 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా రిటైనింగ్ వాల్ నిర్మించారు. మొత్తం 3.44 కిలోమీటర్ల పొడవున ప్రకాశం బ్యారేజీ కింద గత ప్రభుత్వం హయాంలో ఈ నిర్మాణం జరిగింది. మొత్తం ఆరు డివిజన్లకు రక్షణగా ఈ ప్రహరీ గోడను ఏర్పాటు చేశారు.

Also Read: సింగ్‌నగర్‌లో ఆర్తనాదాలు.. ఆహారం లేక జనాల అవస్థలు

#vijayawada #telugu-news #floods #krishna-lanka
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe