Andhra Pradesh: అచ్యుతాపురం సెజ్ ప్రమాదానికి 10 కారణాలు

అనకాపల్లి అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం రియాక్టర్ పేలడం వల్ల కాదని సాల్వెంట్ లీకవడం వల్లనే అని ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ ఘటన వెనుక అదొక్కటే కారణం కాదని..చాలా అవకతవకలు జరిగాయని తెలుస్తోంది.

New Update
Anakapalli: ఒక్క ఘటన..మూడు జిల్లాలు..మాటలకందని విషాదం!

Escientia Sez: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని 'ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌'లో నిన్న మధ్యాహ్నం 2:15 గంటలకు భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భవనంలోని ఒక అంతస్తు కూలింది.ఇందులో మొత్తం 17 మంది మరణించారు. మరికొంత మంది ఆసపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదాఇకి కారణ అందూ రియాక్టర్ పేలడమే అని అనుకున్నారు. కానీ సాల్వంట లీకేజీ వల్లనే ప్రమాదం జరిగిందని ఫ్యాక్టరీస్ విభాగం ఐరెక్టర్ చంద్రశేఖరవర్మ తెలిపారు. రియాక్టర్‌లో తయారైన మిథైల్‌ టెర్ట్‌- బ్యుటైల్‌ ఈథర్‌ మిశ్రమాన్ని స్టోరేజీ ట్యాంకులోకి మార్చే సమయంలో ఆ మిశ్రమం లీకైంది. ఇది చాలా సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే దానిని వెంటనే అరికడతారు. కానీ నిన్న ప్రొడక్షన్‌ బ్లాక్‌లోని రియాక్టర్‌ నుంచి పీడీ ల్యాబ్‌ ద్వారా ట్యాంకులోకి రసాయనాన్ని సరఫరా చేసే సమయంలో లీకేజి ఏర్పడింది. ఆ మిశ్రమం బయటకు వచ్చి వాతావరణ రసాయన చర్యల వల్ల ఆవిరిగా మారింది. ఆ వాయువు సాధారణ వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు సంభవించిందని చంద్రశేఖర వర్మ తెలిపారు. దానికి తోడు రసాయనం ‘రియాక్టర్‌లో తయారైన మిథైల్‌ టెర్ట్‌- బ్యుటైల్‌ ఈథర్‌ మిశ్రమాన్ని స్టోరేజీ ట్యాంకులోకి మార్చే సమయంలో ఆ మిశ్రమం లీకైంది. ప్రొడక్షన్‌ బ్లాక్‌లోని రియాక్టర్‌ నుంచి పీడీ ల్యాబ్‌ ద్వారా ట్యాంకులోకి రసాయనాన్ని సరఫరా చేసే సమయంలో లీకేజి ఏర్పడింది. ఆ మిశ్రమం బయటకు వచ్చి వాతావరణ రసాయన చర్యల వల్ల ఆవిరిగా మారింది. ఆ వాయువు సాధారణ వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు సంభవించింది. అయితే పేలుడు జరిగాక మొత్తం భవనం కూలలేదని..కేవలం గోడలు, ఫాల్స్ సీలింగ్ మాత్రమే కూలాయని చెబుతున్నారు.

అయితే ఈ ప్రమాదం వెనుక సాల్వెంట్ లీకేజీ కాకుండా.. మరో పది కారణాలు వెలుగులోకి వచ్చాయి. అసలు సెజ్ కంపెనీ నిర్వహణలోనే లోపాలున్నాయని చెబుతున్నారు. దాంతో పాటూ ప్రమాదం జరిగిన తర్వాత కూడా వెంటనే చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు.

1. సేఫ్టీ ఆడిట్‌ జరగకపోవడం
2. సేఫ్టీ ఆడిట్ థర్డ్ పార్టీకి అప్పగించి మమ అనిపించడం
3 పొల్యూషన్ బోర్డ్, కార్మికశాఖలో లూప్‌హోల్స్
4. పర్మిషన్ వచ్చాక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం
5. రిపేర్లు వచ్చినప్పుడు నాసిరకంగా మరమ్మతులు చేయడం
6. ఫ్యాక్టరీ భాగస్వాముల మధ్య విభేదాలు
7. అనుభవం లేని సిబ్బంది
8. ప్రమాద తీవ్రతను అంచనా వేయలేకపోవడం
9. రెస్క్యూ ఆపరేషన్‌లో కనిపించిన నిర్లక్ష్యం
10. ప్రాథమిక చికిత్స అందించడంలోనూ ఆలస్యం లాంటి వాటివల్లనే మరణాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

Also Read: Telangana: నాణ్యతను అస్సలు పట్టించుకోలేదు..కాళేశ్వరంపై బయటపడుతున్న నిజాలు

Advertisment
తాజా కథనాలు