Manipur : మణిపూర్‌లో మళ్లీ రీపోలింగ్.. ఎందుకంటే ఏప్రిల్ 19న జరిగిన మొదటి దశ సార్వత్రిక ఎన్నికల్లో మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 22న ఈ పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. By B Aravind 21 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Re Polling : ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లో పార్లమెంటు తొలిదశ ఎన్నికలు(Parliament First Phase Elections) జరిగిన సంగతి తెలిసిందే. అలాగే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) కూడా జరిగాయి. అయితే మణిపూర్‌లోని పలు పోలింగ్ కేంద్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కాల్పులు, బెదిరింపులు, ఈవీఎంల ధ్వంసం వంటి ఘటనలు జరగడం వల్ల.. మణిపూర్‌లో 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇన్నర్ మణిపూర్(Manipur) లోక్‌సభ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ 22న (సోమవారం) మళ్లీ పోలింగ్ నిర్వహిస్తామని మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) శనివారం తెలిపారు. Also Read: కడుపుతో ఉన్న భార్యను మంచానికి కట్టేసి, నిప్పంటించిన భర్త లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) ల్లో భాగంగా ఈ 11 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికలను లెక్కలోకి తీసుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్(EC) పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తాము రీపోలింగ్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఖురాయ్ నియోజకవర్గంలోని తొంగమ్ లైకై, మొయిరంగ్‌కంపు సాజేబ్, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని క్షేత్రీగావ్‌లో నాలుగు, ఉరిపోక్‌లో మూడు, థోంగ్జులో ఒకటి, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కొంతౌజామ్‌లో ఒక పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరగనుందని సీఈవో తెలిపారు. ఇదిలాఉండగా.. లోక్‌సభ తొలి దశ ఎన్నికల్లో భగంగా మణిపూర్‌లోని ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ స్థానాల్లో 72 శాతం పోలింగ్ నమోదైంది. అయితే పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం 47 కేంద్రాల్లో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఒటర్ మణిపూర్‌లో 11 పోలింగ్ కేంద్రాల్లో, అలాగే ఇన్నర్ మణిపూర్‌లో 36 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. చివరికి అధికారులు 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 22 న ఈ పోలీంగ్ జరగనుంది. Also Read: తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ, అమిత్ షా #telugu-news #evm #manipur-news #lok-sabha-lections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి