/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T130812.376.jpg)
Renu Desai Emotional Post On Social Media : ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. పవన్ MLA గా గెలిచినా దగ్గర్నుంచి కొడుకు అకీరా నందన్ తండ్రితోనే ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా వారసుడ్ని రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నాడు.
ఇందులో భాగంగానే పవన్ తాజాగా తన కొడుకుని నరేంద్ర మోడీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యాయి. తాజాగా దీనిపై రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Also Read : రీ ఎంట్రీకి రెడీ అంటున్న’బొమ్మరిల్లు’ హీరోయిన్.. అలాంటి పాత్రలే చేస్తా అంటూ!
మాటల్లో వర్ణించలేను...
" నాకు మొదటి నుంచి భాజపా అంటే అభిమానం. మోదీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. దానిని మాటల్లో వర్ణించలేను. మోదీ గారిని కలిశాక అకీరా నాకు ఫోన్ చేసి తన అనుభూతిని పంచుకున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని. తన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడు" అంటూ తన పోస్ట్ లో పేర్కొంది. దీంతో రేణు దేశాయ్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram
Follow Us