Renu Desai : ఏపీ ఎమ్మెల్యే కి పవన్ మాజీ భార్య అభినందనలు.. వైరల్ అవుతున్న పోస్ట్!

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఏపీలో రేపల్లె ఎమ్మెల్యే గా గెలిచిన అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.

Renu Desai : ఏపీ ఎమ్మెల్యే కి పవన్ మాజీ భార్య అభినందనలు.. వైరల్ అవుతున్న పోస్ట్!
New Update

Renu Desai Instagram Post Going Viral :  ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) సార్వ‌త్రిక‌ ఎన్నికల (General Elections) ఫలితాల్లో టీడీపీ కూటమి (TDP Alliance) భారీ విజయాన్ని సొంతం చేసుకున్నవిషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా కూటమి అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ క్రమంలోనే ఏపీలో గెలిచిన అభ్యర్థులకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇందులో భాగంగానే సినీ నటి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. ఇక ఇప్పుడు ఏపీలో గెలిచిన మరో ఎమ్మెల్యే కి శుభాకాంక్షలు తెలిపింది.

Also Read : పవన్ కళ్యాణ్ కు తమిళ స్టార్ అభినందనలు.. వైరల్ అవుతున్న ట్వీట్!

కంగ్రాట్స్ అన్నయ్య...

రేణు దేశాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'కంగ్రాట్స్ అన్నయ్య' అంటూ ఓ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రేపల్లె నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ దాదాపు 40 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలో రేణు దేశాయ్ అనగాని సత్యప్రసాద్ కు కంగ్రాట్స్ అన్నయ్య.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

publive-image

#andhra-pradesh #renu-desai #general-elections-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe