మా పర్సనల్ లైఫ్‌ గురించి మాట్లాడటం జర్నలిజం ఎలా అవుతుంది!

రేణు దేశాయ్ మరోసారి సోషల్‌ మీడియా వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కారు. తమ పర్సనల్‌ లైఫ్‌ గురించి పదేపదే వార్తల్లో మాట్లాడటం జర్నలిజం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.

New Update
Renu Desai : ఎన్నికల సమయంలో హాట్‌ టాపిక్‌ గా రేణు దేశాయ్ పోస్ట్‌.. దీనికి అర్థం ఏంటి?

Renu Desai Tweet : టాలీవుడ్‌ ప్రముఖ నటి రేణు దేశాయ్(Renu Desai) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా అందరికీ తెలిసిందే. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నుంచి ఆమె విడాకులు తీసుకుని వేరుగా నివసిస్తున్నప్పటికీ కూడా ఆమె ఏదోక విధంగా వార్తల్లోకి వస్తున్నారు. ఎక్కువగా పవన్‌(Pawan Kalyan) విషయంలో ముడిపెట్టే ఆమెను వివాదాల్లోకి లాగుతున్నారు.

పవన్‌ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తమ పర్సనల్ విషయాల గురించి ఎక్కువగా మీడియాలో వార్తలు రావడంతో ఆమె పలుమార్లు పాలిటిక్స్ లోకి వ్యక్తిగత విషయాలు లాగొద్దని తెలిపింది. అయినప్పటికీ కూడా రేణుని రాజకీయ విషయాలు ఇబ్బంది పెడుతునే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ఆమె సోషల్ మీడియా వేదికగా తన బాధను తెలిపింది.

publive-image

రాజకీయాల్లోకి సినిమా వాళ్ల వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు లాగుతున్నారు? వాటి వల్ల సమాజానికి ఏమన్నా నష్టం వాటిల్లుతుందా? అని ప్రశ్నించారు. అలాగే అసలు జర్నలిజం అంటే ఏంటి ఇలా అవతల వాళ్ల వ్యక్తిగత జీవితాల కోసం మాట్లాడుకుంటూ కూర్చొని షో చేయడమా? సినిమా వాళ్ల పర్సనల్ లైఫ్‌ వల్ల సమాజానికి శాంతి భద్రతలకు ఏమన్నా నష్టం వచ్చిందా?అలాంటప్పుడు ఎందుకు ప్రతిసారి మా వ్యక్తిగత జీవితాన్ని లాగుతున్నారంటూ ఆమె ఆవేదని వ్యక్త పరిచారు.

సినిమా ఇండస్ట్రీ వాళ్లు సాఫ్ట్ గా ఉంటారని ఇలా ఏది పడితే అది మాట్లాడితే ఎవరికైనా సహనం చచ్చిపోతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో ఆమె పోస్ట్ మళ్లీ వైరల్ గా మారింది.

Also read: రామాలయ గర్భగుడి ఫొటో ఇదే.. ఎంత అద్భుతంగా ఉందో చూడండి!

Advertisment
తాజా కథనాలు