MP Raghurama: ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట.. కీలక తీర్పునిచ్చిన న్యాయస్థానం..

ఇటీవల సంక్రాంతికి తమ ఊరికి వెళ్తున్నాని ఇందుకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఊరట లభించింది. ఆయనకు 41 విధానాన్ని అనుసరిస్తూ రక్షణ కల్పించాలని తీర్పు వెలువరించింది.

MP Raghurama: ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట.. కీలక తీర్పునిచ్చిన న్యాయస్థానం..
New Update

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. 41A ప్రొసీజర్ ఫాలో అవుతూ ఆయనకు రక్షణ కల్పించాలని తీర్పునిచ్చింది. ఇటీవల ఆయన సంక్రాంతికి తమ ఊరుకు వెళ్తున్నానని.. ఇందుకోసం తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది. పోలీసులు ఇప్పటికే రఘురామకృష్ణరాజుపై 11 కేసులు పెట్టారని.. ఇంకా మరొక కేసు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని ఆయన తరఫున న్యాయవాదులు పిటీషన్‌లో తెలిపారు.

Also Read: అలా చేసినందుకే బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది: ప్రొ. కోదండరాం

విచారణ అవసరం లేదు

గతంలో రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు అరెస్టు చేశారని.. అలాగే ఆయన్ని చిత్రహింసలకు కూడా గురి చేశారని ఆరోపించారు. ఇప్పుడు కూడా మళ్లీ మరోసారి తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. ఏపీ పోలీసులు నిబంధనలు పాటించేలా వారికి ఆదేశాలివ్వాలని న్యాయవాదులు కోర్టును కోరారు. మరోవైపు రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు విచారణ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.

ఆ మార్గదర్శకాలు పాటించండి

కేసు నమోదై.. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు ఉంటేనే 41ఏ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. తాజాగా ఆయనపై ఎలాంటి కేసులు పెట్టలేదని చెప్పారు. అయితే ఇరువర్గాల వైపు వాదనలు విన్న హైకోర్టు చివరికి శుక్రవారం తీర్పునిచ్చింది. 41ఏ విధానాన్ని అనుసరిస్తూ రఘురామకృష్ణరాజుకు రక్షణ కల్పించాలని.. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్‌లెన్స్‌ను అనుసరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ తీర్పుతో సంక్రాంతి పండక్కి తన గ్రామానికి రానున్న ఎంపీ రఘురామకృష్ణరాజుకు పోలీసులు రక్షణ కల్పించాల్సి ఉంటుంది.

Also read: 14వేల కోట్లకు మేఘా విడాకులు..పీపీరెడ్డిని బయటకు పంపేసిన కృష్ణారెడ్డి

#telugu-news #ap-politics #ap-high-court #mp-raghurama-krisharaju
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe