/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/excercise-jpg.webp)
Daily Habits : ప్రతిరోజూ వ్యాయామం(RegularExercise) చేసేవాళ్లు ఎల్లప్పడు ఆరోగ్యంగా, యాక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే వ్యాయామం అనేది కుంగుబాటు(Prolapse) బాధితుల్లో కూడా చికిత్సలతో సమానంగా పనిచేస్తోందని.. ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. యోగా(Yoga) చేయడం, నడవడం, పరిగెత్తడం, బరువులు ఎత్తడం అనేది మరింత ప్రభావాన్ని చూపుతున్నట్లు తేలింది. వాస్తవానికి కుంగుబాటు అనేది అనేక వ్యాధులకు దారి తీస్తుంది. ఆందోళన, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుంది.
Also Read : అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా.. అయితే ఉడకబెట్టిన ఈ 3 పదార్థాలను తినండి!
కొందరు మందులు, మానసిక చికిత్సతో కుంగుబాటు నుంచి కోలుకుంటారు. మరికొందరికి ఇవి పనిచేయవు. ఇలాంటి సమయాల్లోనే మందులు, మానసిక చికిత్సలతో పాటు వ్యాయామం కూడా తోడైతే.. మంచి ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఎంత ఎక్కువగా వ్యాయామం చేస్తే అంత ఎక్కువగా ఫలితాలు వస్తున్నట్లు అధ్యయనంలో బయటపడింది.
సామాజిక బంధాలు ఏర్పడతాయి
వ్యాయామం చేసేటప్పుడు మెదడులో ఎండార్ఫిన్లనే రసాయనాలు రిలీజ్ అవుతాయి. ఇవి సహజంగా హాయి భావనను కలిగించి బాధలను తగ్గించేలా చేస్తాయి. సాధారణంగా ఎవరైనా కుంగుబాటుకు లోనైతే ప్రతికూల భావనలు వెంటాడుతాయి. వీటి నుంచి బయటపడేందుకు వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు నిత్యం వ్యాయామం చేయడం వల్ల భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాయామం చేయడం కోసం బయటికి వెళ్లినప్పుడు ఇతరులతో సామాజిక బంధాలు ఏర్పడతాయి. వారు నవ్వుతూ పలకరించినా, మాట్లాడినా మూడ్ మొత్తం మారిపోయి మనుసు తేలికవుతుంది.
Also Read: దంగల్ గర్ల్‌ని చంపేసిన ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? సమంతకి ఉన్న సమస్య కూడా ఇదేనా?